Advertisement
Google Ads BL

శ్యామ్ సింగ రాయ్ కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన చివరి పాట


శ్యామ్ సింగ రాయ్ కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన చివరి పాట డిసెంబర్ 7న విడుదల

Advertisement
CJ Advs

న్యాచులర్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ నుంచి వస్తున్న ప్రతీ ఒక్క అప్డేట్ సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. 

డిసెంబర్ 7న సిరివెన్నెల రాసిన పాటను చిత్రయూనిట్ విడుదల చేయబోతోంది. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లో నాని, సాయి పల్లవి ఆకట్టుకున్నారు. నాని తన మీసాన్ని తిప్పుతూ ఉంటే.. సాయి పల్లవి మాత్రం సిగ్గుపడుతున్నట్టుగా కనిపిస్తున్నారు. శ్యామ్ సింగ రాయ్ సినిమాకు నాని, సాయి పల్లవి మధ్య వచ్చే ప్రేమ కథ అతి పెద్ద బలంగా మారుతుందనిపిస్తోంది.

సిరివెన్నెల పాటకు మిక్కీ జే మేయర్ క్లాస్ ట్యూన్ ఇచ్చారు. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. సాంగ్ ప్రోమోను ఇది వరకే విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. ఇక పూర్తి సాంగ్ రేపు విడుదల కాబోతోంది.

సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథను అందించారు. మెలోడి స్పెషలిస్ట్ మిక్కీ జే మేయర్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తుండగా.. జాన్ వర్గీస్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

జాతీయ అవార్డు గ్రహీత కృతి మహేష్, ప్రతిభా వంతుడైన యశ్ మాస్టర్ ఈ చిత్రంలోని పాటలకు కొరియోగ్రఫర్లుగా పని చేస్తున్నారు. రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం వంటి వారు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం దక్షిణాది అన్ని భాషల్లో డిసెంబర్ 24న విడుదల కానుంది.

నటీనటులు : నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం, జిషు సేన్ గుప్తా, లీలా సామ్సన్, మనీష్ వద్వా, బరున్ చందా తదితరులు

సాంకేతిక బృందం: దర్శకత్వం : రాహుల్ సంకృత్యాన్, నిర్మాత : వెంకట్ బోయనపల్లి, బ్యానర్: నిహారిక ఎంటర్టైన్మెంట్, కథ: సత్యదేవ్ జంగా, సంగీతం: మిక్కీ జే మేయర్, సినిమాటోగ్రఫర్: సాను జాన్ వర్గీస్, ప్రొడక్షన్ డిజైనర్ : అవినాష్ కొల్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎస్ వెంకట రత్నం (వెంకట్), ఎడిటర్ : నవీన్ నూలి, ఫైట్స్ : రవి వర్మ, కొరియోగ్రఫీ : కృతి మహేష్, యశ్ మాస్టర్, పీఆర్వో : వంశీ-శేఖర్.

Shyam Singh Roy Released on December 7th:

Shyam Singh Roy Released on December 7th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs