Advertisement
Google Ads BL

డిసెంబర్ 10న ప్రియతమా


డిసెంబర్ 10వ తేదీన విడుదల కాబోతున్న ప్రియతమా చిత్రం

Advertisement
CJ Advs

ఆనంద్ కుమార్, నాగ వంశీ కృష్ణ, వికాస్ చంద్ర, ఉషా, ఏంజిల్, వృషాలి ప్రధాన పాత్రలలో సంతోష్ పార్లవర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ప్రియతమా. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ను పులకుర్తి కొండయ్య నిర్మిస్తున్నాడు. ట్రయాంగిల్ లవస్టోరీ గా వెరైటీ కథనంతో తెరకెక్కిన ఈ చిత్రం ఆర్కే టాకీస్ బ్యానర్ సమర్పణలో రాబోతుండగా ఈ సినిమా ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ మరియు ప్రముఖ దర్శకుడు రవికుమార్ చౌదరి విడుదల చేయగా, పాటలను లెజెండరీ డైరెక్టర్ బి.గోపాల్ విడుదల చేశారు. వీటికి ప్రేక్షకుల దగ్గరి నుంచి మంచి రెస్పాన్స్ రాగా ఈ సినిమాను డిసెంబర్ 10 వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ విడుదల ప్రకటించింది.

ఈ సందర్భంగా నిర్మాత పులకుర్తి కొండయ్య మాట్లాడుతూ.. ప్రియతమా చిత్రం ప్రతి ఒక్కరిని అలరించే సినిమా. దర్శకుడు సంతోష్ పార్లవార్ మంచి కథ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రేమ కథలలో సరికొత్త లైన్ ను ఎంతో బాగా యూత్ కి నచ్చేలాగా తెరకెక్కించాడు. మా చిత్రం ఇంతబాగా రావడానికి సహకరించిన అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు. డిసెంబర్ 10వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందరికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది అన్నారు. 

ఆనంద్ కుమార్ , నాగ వంశీ కృష్ణ , వికాస్ చంద్ర, ఉషా, ఏంజెల్, వృషాలి, చిత్రం శ్రీను, ఫిష్ వెంకట్, సుమన్ శెట్టి, నర్సింగ్ యాదవ్, చంద్రమోహన్, రచ్చ రవి, అప్పారావు, సత్తిపండు, జయరాజ్, సన్నీ, స్నేహల్, సాక్షి, యాప్.యం. బాబాయ్, లక్ష్మీ ప్రసన్న, సంధ్యారాణి, నాగిరెడ్డి, యాదేశ్, రమేష్, సాధు, జె.శ్రీనివాస్, గోపి, వెంకట్ రెడ్డి, శివ, కె.నాగేశ్వరావు, దేవిధాస్, యం. సూర్యచందర్ రావు, యస్. శ్రీనివాసరావు, జి.నవీన్ కుమార్, కిరణ్ వైద్యా, కరుణాకరన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం; చైతన్య, సినిమాటోగ్రఫీ; ఆనేం వెంకట్, ఎడిటింగ్; బి. మహేంద్రనాథ్, పాటలు; సంతోష్ పార్లవార్పు..  పులకుర్తి కొండయ్య, నవీన్ రాంపోగు, హర ఉప్పాడ, నిర్మాత;పులకుర్తి కొండయ్య, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం; సంతోష్ పార్లవార్.

Priyatama movie release on December 10th:

Priyatama movie release on December 10th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs