Advertisement
Google Ads BL

రిపబ్లిక్ మూవీ కాదు, మూమెంట్


ప్రేక్షకులకు కేవలం వినోదం అందించడం మాత్రమే తమ బాధ్యత అని జీ 5 అనుకోవడం లేదు. వినోదాత్మక సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డైరెక్ట్‌-టు-డిజిట‌ల్ రిలీజ్‌లతో ప్రజలను ఆకట్టుకుంటోంది. అదే సమయంలో ప్రజల్ని చైతన్యం చేసే సినిమాలనూ అందిస్తోంది. రిపబ్లిక్ వంటి సినిమాలకు అండగా ఉంటోంది. జీ 5 అంటే వినోదం మాత్రమే కాదు, అంతకు మించి అనే పేరు తెచ్చుకుంటోంది. 

Advertisement
CJ Advs

సుప్రీమ్ హీరో సాయి తేజ్, విలక్షణ దర్శకుడు దేవ్ కట్టా కలయికలో రూపొందిన సినిమా రిపబ్లిక్. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ అధికారుల పాత్ర ఏమిటి? రాజకీయ నాయకులు ఎలా ఉండాలి? ప్రజలు ఏం చేయాలి? ఏం తెలుసుకోవాలి? వంటివి చెబుతూ... సామాజిక బాధ్యతతో రూపొందిన చిత్రమిది. దీనికి థియేటర్లలో మంచి స్పందన లభించింది. అప్పట్లో కరోనా భయాలతో వెళ్లని ప్రేక్షకులు, జీ 5 ఓటీటీ వేదికలో విడుదలైన తర్వాత సినిమాను ఓ ఉద్యమంలా చూశారు. రిపబ్లిక్ ఓ సినిమా కాదని, ఉద్యమం (రిపబ్లిక్ మూవీ కాదు, మూమెంట్) అని అంటున్నారు. 

నవంబర్ 26న జీ 5 ఓటీటీ వేదికలో రిపబ్లిక్ సినిమా విడుదలైంది. ఆ రోజు నుంచి సోషల్ మీడియాలో సినిమా ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా డైరెక్టర్ కామెంటరీతో సినిమాను విడుదల చేసిన జీ 5 బృందాన్ని అందరూ అభినందిస్తున్నారు. మన దేశంలో తొలిసారి డైరెక్టర్ కామెంటరీతో విడుదలైన సినిమా కూడా ఇదే. జీ 5 లో విడుదలైన ఏడు రోజుల్లో సినిమాను 12 కోట్ల నిమిషాల పాటు వీక్షకులు చూశారు. ఇదొక రికార్డు. సాయి తేజ్ కెరీర్‌లో ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ అయ్యింది. సాయి తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా కూడా జీ 5 ఓటీటీలో విడుదలైంది.

Republic is not a movie, it's a movement:

Republic is not a movie, it's a movement; Audience make it a blockbuster on ZEE5 <div></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs