Advertisement
Google Ads BL

ప్రతి పండగకీ నేనుంటా.. -సుమ కనకాల


సుమ కనకాల యాంకర్ గా, నటిగా గత 20 ఏళ్లుగా మన ఇంటి ఆడపడుచులా మనందరితో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఫెస్టివల్స్ ఫర్ జాయ్ అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్టాపించారు ఆమె. దసరా సందర్భంగా ప్రారంభమైన ఈ సంస్థ.. ప్రజ్వల అనే ప్రముఖ సేవా సంస్థ అధినేత సునీత కృష్ణన్ సంరక్షణలో ఉన్న పది మంది మహిళలకు జీవనోపాధి కల్పించడానికి ఆర్థిక సహాయం, అక్కడే ఉంటున్న పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్క్ ఏర్పాటు చేసారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన చిత్ర పరిశ్రమ కు చెందిన 10 మంది మహిళలకు ఏడాది పాటు నిత్యావసర వస్తువులను, వారికి అవసరమైన మెడిసిన్ అందించారు. 

Advertisement
CJ Advs

తాజాగా ఈరోజు అనగా ఆదివారం నాడు రానున్న క్రిస్మస్ సందర్భంగా మొదటిసారి.. ఆరోగ్య పరిరక్షణ కోసం గ్రేస్ ఫౌండేషన్, తానా సహకారంతో చిత్ర, టెలివిజన్ పరిశ్రమలకు చెందిన 250 మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ను నిర్వహించారు. ఈ స్క్రీనింగ్ లో 10 మందికి క్యాన్సర్ లక్షణాలు కనిపించాయని గ్రేస్ ఫౌండేషన్ వైద్యులు డాక్టర్ ప్రమీల, డాక్టర్ చినబాబు తెలిపారు. ఈ 10 మందికి మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించి.. మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమ కనకాల, డాక్టర్ చినబాబు, డాక్టర్ ప్రమీల, తానా తరపున తానా ట్రస్టీ విద్య గారపాటి పాల్గొన్నారు.

Suma started festivals for Joy :

Suma Kanakala organises Cancer Screeming camp 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs