Advertisement
Google Ads BL

ఏడా తానున్నాడో ట్రైలర్ విడుదల


దిల్ రాజు గారి బ్యానర్లో రైటింగ్  & డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో 7, 8 ఏళ్లుగా పనిచేసిన దొండపాటి వంశీ కృష్ణ ను దర్శకుడిగా  పరిచయం చేస్తూ తనిష్కా మల్టీ విజన్స్ బ్యానర్ పై గుజ్జా యుగందర్ రావు నిర్మిస్తున్న చిత్రం ఏడా తానున్నాడో త్వరలో విడుదల కానున్న ఏడా తానున్నాడో చితం థియేటర్ ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది..

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా చిత్ర దర్శకులు వంశీ కృష్ణ దొండపాటి మాట్లాడుతూ.. రోడ్ ట్రిప్ బేసెడ్ ఏమోషనల్  ఫీల్ గుడ్ love story, వికారాబాద్ ఫారెస్ట్, శ్రీశైలం ఫారెస్ట్, బెంగుళూర్, మైసూర్, కూర్గ్ హిల్ స్టేషన్ పలు అద్భుతమైన లొకేషన్ లలో చిత్రీకరించడం జరిగింది.. చరణ్ అర్జున్ అందించిన ఫీల్ గుడ్ మ్యూజిక్, ఎమోషనల్ మెలోడీస్ తో మ్యూజికల్ లవ్ స్టోరీ గా  రూపొందించడం జరిగింది.

ఇంతకు ముందు ప్రేక్షకులు ప్రియురాలు కోసం ప్రియుడు వెతికే చాలా ప్రేమ కథలను చూసి వుంటారు. మొట్టమొదటి సారి తాను ప్రేమించిన ప్రియుడి కోసం, అతని జ్ఞాపకాల దారుల్లో వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూన్న భగ్న ప్రేయసి కథ. అడ్వెంచర్ థ్రిల్లర్ సంఘటనలతో ఎన్నో మలుపులు తిరిగిన చివరకు వాళ్లు కలిసారా? లేదా? వెండి తెరపైన చూడాల్సిందే. ముఖ్యంగా సంజయ్ స్వరూప్ చేసిన పాత్ర సినిమాను చాలా  కీలకం.. 

బాలు చిత్రం లో జూనియర్ పవన్ కళ్యాణ్ గా నటించిన అభినవ్ మణికంఠ సుమారు 53 సినిమాలో బాలనటుడిగా నటించినది విదితమే. ఈ ఏడా తానున్నడో చిత్రం ద్వారా అభినవ్ మణికంఠ హీరోగా పరిచయం అవుతున్నాడు. స్వేచ్ఛా యుత జీవితంలో ఒక స్వచమైన ప్రియురాలిగా అద్భుతముగా నటించిన కోమలి ప్రసాద్ నటన సినిమాకే హైలైట్..

ఇతర ముఖ్య పాత్రల్లో శివాజీ రాజా, యంగ్ కమెడియన్ సుదర్శన్, జబర్దస్త్ ఫణి, లావణ్య రెడ్డి, సాత్విక్, కావేరి, నటించారు.

సాంకేతిక వర్గం: కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వంశీకృష్ణ దొండపాటి, లిరిక్స్ & సంగీతం: చరణ్ అర్జున్, కెమెరా: శ్రీకాంత్, ఎడిటింగ్: నరేష్ రెడ్డి - కుమార్ జిట్టా, కో - ప్రొడ్యూసర్స్: చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, రమేష్ రెడ్డి గవ్వా, నిర్వాహణ: కాకతీయ ఇన్నోవేటివ్స్.

Yada Thanunnado Trailer release:

Yada Thanunnado Trailer release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs