Advertisement
Google Ads BL

గేమ్ ఆన్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్


గేమ్ ఆన్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల

Advertisement
CJ Advs

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ మరియు గోల్డెన్ వింగ్స్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న గేమ్ ఆన్ సినిమా రవి కస్తూరి సమర్పణలో డిసెంబర్ మూడవ వారంలో షూటింగ్ మొదలవుతుంది. సినిమా ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితుడైన కుమార్ బాబు నిర్మాతగా తెలుగు తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. హీరోగా రథం ఫేం గీతానంద్ తన తొలి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకొని అందరి ప్రశంశలు పొందిన గీతానంద్ హీరోగా నటిస్తున్నారు.దర్శకుడు దయానంద్ తన మొదటి సినిమా బాయ్స్ తో అందరి టెక్నీషియన్స్ మన్ననలు పొంది యూత్ ని ఆకట్టుకునేలా త్వరలో రిలీజ్ కు సిద్ధమై ఉంది.ఈ ఇద్దరి కలయికతో నిర్మిస్తున్న గేమ్ ఆన్ సినిమా సరికొత్త కథతో ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్ పై రానటువంటి కథాంశంతో మంచి టెక్నీషియన్ తో నిర్మిస్తున్న చిత్రం. సినిమా స్టార్ట్ చేయకుండానే సినిమా కథ తెలిసి హిందీ రైట్స్ అడగడం ఆశ్చర్యకరంగా ఉంది. నాకు తెలిసి ఈ సినిమా చిన్న సినిమాల్లో చాలా పెద్ద సినిమా అవుతుంది.

ఇందులో ప్రేక్షకులకు కావాల్సిన ఎలిమెంట్స్ ఎమోషన్,లవ్ సెంటిమెంట్స్, ట్విస్టులు ఇలా అన్ని రకాలుగా అందరిని ఆకట్టుకునే అంశాలు అన్నీ ఉన్నాయి. నాకున్న అనుభవంతో చెప్తున్నా టాప్ టెన్ మూవీస్ లో ఈ సినిమా ఖచ్చితంగా నిలుస్తుంది. ఈ సినిమాతో గీతానంద్ మంచి హీరోగా నిలబడటమే కాకుండా దర్శకుడిగా దయానంద్ మంచి మార్కులు కొట్టేస్తాడు.మంచి  టెక్నీషియన్స్ దొరకడమే కాకుండా ఈ సినిమాకు ఆర్టిస్టులు అందరూ సెట్ అవుతున్నారు.చాలా మంచి ఇంపార్టెంట్ మధుబాల మదర్ క్యారెక్టర్ చేస్తుంది. కన్నడ కిషోర్, మధుసూదన్  చాలా మంది ఆర్టిస్టులు ఈ సినిమాకు కరెక్ట్ గా సెట్ అవుతున్నారు. ఈ సినిమా 2022లో ఖచ్చితంగా చాలా పెద్ద సినిమా అవుతుందనే నమ్మకం ఉందని నిర్మాత కుమార్ బాబు తెలియజేశారు.

సాంకేతిక నిపుణులు, సమర్పణ: రవి కస్తూరి, బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంటకేశ్వర క్రియేషన్స్ & గోల్డెన్ వింగ్స్ ప్రొడక్షన్స్‌, నిర్మాత: కుమార్ బాబు, రచన,దర్శకత్వం: దయానంద్, లైన్ ప్రొడ్యూసర్: నికిలేష్ వర్మ, విజువల్స్: కుశేందర్ రమేష్, ప్రొడక్షన్ డిజైన్: దిలీప్ జాన్, సంగీతం: అశ్విన్- అరుణ్, పి.ఆర్.ఓ: మధు.వి.ఆర్.

Game On First Look Motion Poster:

Game On Shooting will begin in the third week of December
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs