Advertisement
Google Ads BL

పాయిజన్ మూవీ ట్రైలర్ లాంచ్


ఏఎంబి మాల్ లో గ్రాండ్ గా జరిగిన పాయిజన్ మూవీ ట్రైలర్ లాంచ్ వినూత్న రీతిలో జరిగిన పాయిజన్ మూవీ క్విజ్ కాంపిటీషన్ లో ప్రైజులు గెలుచుకున్న అతిధిలు, ప్రేక్షకులు ముఖ్య అతిథిగా వచ్చిన

Advertisement
CJ Advs

నిర్మాత సి కళ్యాణ్ గారు మాట్లాడుతూ .. ఈ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత ఈ మూవీ ఒక హాలీవుడ్ మూవీ చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తుంది. నాకు ఈ ప్రొడ్యూసర్స్ బాగా తెలుసు సినిమా అంటే ప్రాణం పెడతారు. చాలా రిచ్ గా కాస్ట్లీ గా తీశారు, హీరో రమణకు మంచి భవిష్యత్తు ఉంది డైరెక్టర్ రవి చంద్రన్ మా కాంపౌండ్ వాడు మంచి టాలెంటెడ్ ట్రైలర్ లోనే తన ప్రతిభను చాటాడు. చాలా బ్యూటిఫుల్ గా చూపాడు. యూత్ అంతా ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు అనే దానిలో సందేహం లేదు ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది అన్నారు.

నిర్మాత పుప్పాల రమేష్ గారు మాట్లాడుతూ.. ట్రైలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. రిచ్ నెస్ బాగా కనపడుతుంది. మ్యూజిక్ డిఫరెంట్ పంథాలో ఉంది. హీరో రమణ మంచి ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు. హీరోకు కావలసింది అదే..రమణ వాయిస్ చాలా బాగుంది. మన సినిమా పరిశ్రమకు ఇంకొక హీరో దొరికాడు.డైరెక్టర్ కు డైరెక్షన్ మీద మంచి పట్టు కనబడుతుంది. ట్రైలర్ కట్ చేసిన విధానం లో కనపడుతుంది. ప్రొడ్యూసర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మూవీ తీసినట్టు తెలుస్తుంది మూవీ పెద్ద హిట్ అవుతుంది.యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా వస్తున్న పాయిజన్ మూవీ టీం కు ఆల్ ద బెస్ట్ అన్నారు. 

నిర్మాత లయన్ సాయివెంకట్ గారు మాట్లాడుతూ.. ట్రైలర్ చూసిన తర్వాత ఈ చిత్ర ప్రొడ్యూసర్స్ కు కనక వర్షం కురిపిస్తుంది అనడంలో సందేహం లేదు. యూత్  డెఫినెట్ గా ఈ సినిమా కు కనెక్ట్ అవుతారు. ఈ సినిమాకు మంచి బిజినెస్  ఆఫర్స్ వస్తున్నాయని వినబడింది. హీరో రమణ ఎక్స్ ప్రెషన్ చూస్తే అనుభవం ఉన్న హీరోలా చేశాడు. డైరెక్టర్ రవికి ఈచిత్రం ఒక ట్రెండ్ సెట్ అవుతుంది అన్నారు.

చిత్ర దర్శకుడు రవిచంద్రన్ మాట్లాడుతూ.. ప్రొడ్యూసర్స్ చాలా ప్యాషనేట్ ఉన్న వారు. నేను ఏది అడిగితే అది సమకూర్చారు. ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. హీరో రమణ సింగిల్ టేక్ లో యాక్షన్ కు నిమిషాల్లో క్యారెక్టర్ లో కి వెళ్ళిపోతాడు.తను తప్పకుండా మంచి హీరో అవుతాడు అని అన్నారు.

చిత్ర హీరో రమణ మాట్లాడుతూ.. ఎంటైర్ మీడియాకు మా ధన్యవాదాలు. కళ్యాణ్ గారు మాకు గురువు ఆయన ఆశీర్వాదంతో తోడుగా ఉంటే ఎంతైనా సాధించగలం అనే నమ్మకం ఉంది అన్నారు. 

చిత్ర నిర్మాత శిల్పిక. కె మాట్లాడుతూ.. ఈ ఫంక్షన్ కు వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్ గా జరిగడానికి  తోడ్పడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.మా బ్యానర్ లో త్వరలో రెండు కొత్త సినిమాలు అనౌన్స్ చేస్తాము అన్నారు. 

Poison Movie Trailer Launch:

Poison Movie Trailer Launch
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs