Advertisement
Google Ads BL

సమంత గ్లోబల్‌ ఎంట్రీ


గ్లోబల్‌ వేదికకు గోల్డెన్‌ గర్ల్ సమంత

Advertisement
CJ Advs

ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు నాన్‌స్టాప్‌గా ఎకో అవుతున్న ఏకైక పేరు సమంత రూత్‌ ప్రభు. మన సౌత్‌ సినిమా గోల్డెన్‌ గర్ల్ ఇప్పుడు హాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు. వెరీ ఫస్ట్ ఎంట్రీతోనే గ్లోబల్‌ రేంజ్‌లో గ్లో కావడం ఖాయం అంటున్నారు ఆమె సన్నిహితులు. సమంత గ్లోబల్‌ ఎంట్రీ గురించి అనౌన్స్ మెంట్‌ వచ్చేసింది. అరేంజ్‌మెంట్స్ ఆఫ్‌ లవ్‌ అనే గ్లోబల్‌ సినిమాలో ఫీమేల్‌ లీడ్‌గా నటిస్తున్నారు సమంత రూత్‌ ప్రభు. తిమెరి మురారి రాసిన అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్‌ అనే ప్రముఖ నవల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా అది. ఈ సినిమాతో ప్రపంచ స్క్రీన్‌ మీద మన ఫ్యామిలీమేన్‌2 గర్ల్ సత్తా చాటడం ఖాయం అంటున్నారు మేకర్స్. బాఫ్టా అవార్డు పొందిన డైరక్టర్‌ ఫిలిప్‌ జాన్‌ డైరక్ట్ చేస్తున్న సినిమా ఇది. ఆయన డైరక్ట్ చేసిన డౌన్‌టౌన్‌ అబ్బేకి క్రిటిక్స్ నుంచి ఎన్ని గొప్ప గొప్ప కాంప్లిమెంట్స్ అందాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.

అరేంజ్‌మెంట్స్ ఆఫ్‌ లవ్‌ను గురు ఫిల్మ్స్ పతాకంపై సునీత తాటి నిర్మిస్తున్నారు. ఈమె గతంలో సమంతతో ఓ బేబీ తీసిన నిర్మాత. ఔట్‌ ఆఫ్‌ ద బాక్స్ తో పాటు వెర్సటైల్‌ కంటెంట్‌ని తన బ్యానర్‌లో నిర్మిస్తారనే గొప్ప పేరు తెచ్చుకున్నారు సునీత తాటి. అరేంజ్‌మెంట్స్ ఆఫ్‌ లవ్‌ను దర్శకుడు ఫిలిప్‌ జాన్‌ స్వయంగా రాసుకున్నారు. నిమ్మి హరస్గమ కో రైటర్‌గా పనిచేశారు.

ఈ సినిమా గురించి ప్రొడక్షన్‌ హౌస్‌ ట్విట్టర్‌లో గ్రాండ్‌గా అనౌన్స్ చేసింది. మా సక్సెస్‌ఫుల్‌ ఓ బేబీ తర్వాత, ఇప్పుడు సరికొత్త ఇంటర్నేషనల్‌ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయడానికి హ్యాపీగా ఫీలవుతున్నాం. తిమెరి మురారి రాసిన అరేంజ్‌మెంట్స్ ఆఫ్‌ లవ్‌ అనే నవలను అదే పేరుతో మేం తెరకెక్కించబోతున్నాం. ఫిలిప్‌ ఆర్‌ జాన్‌ రాసి, డైరక్ట్ చేస్తున్నారు. నిమ్మి హరస్గమ కో రైటర్‌గా పనిచేశారు. గురు ఫిల్మ్స్ పతాకంపై సునీత తాటి నిర్మిస్తున్నారు అని ట్విట్టర్‌లో అనౌన్స్ మెంట్‌ ఇచ్చారు.

ఇంటర్నేషనల్‌ సినిమాలో తన రోల్‌ గురించి సమంత ఎగ్జయిటింగ్‌గా ఉన్నారు. సునీత తాటికి, సమంతకు అత్యద్భుతమైన ప్రొఫెషనల్‌ రిలేషన్‌షిప్‌ ఉంది. ఇలాంటి గ్లోబల్‌ అనౌన్స్మెంట్స్ గురించి విన్నప్పుడు సౌత్‌ ఇండియన్‌ విమెన్‌ ప్రపంచ స్క్రీన్‌ మీద హల్‌చల్‌ చేస్తున్న విషయం గుర్తొచ్చి ఆనందంగా ఉంటుందంటున్నారు శ్రేయోభిలాషులు.

Samantha Global Entry:

Golden Girl Samantha to the Global Platform
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs