Advertisement
Google Ads BL

ఓన్లీ సోషల్ మీడియా ప్రమోషన్స్ ఏంటి రాజా


రాజ్ తరుణ్ అనుభవించు రాజా రేపు థియేటర్స్ లో విడుదల కానుంది. సోషల్ మీడియాలో రాజ్ తరుణ్ అండ్ అనుభవించు రాజా టీం చేసే ప్రమోషన్స్ కి ఆడియన్స్ అంతా ఆ సినిమాపై అట్రాక్ట్ అయ్యే విధంగా ఉంది. గుళ్ళు గోపురాలు, అలాగే పల్లెటూర్లని విజిట్ చెయ్యడం, సోలో ఇంటర్వూస్, ఇలా హంగామా బాగానే చేస్తున్నా.. అక్కినేని కాంపౌండ్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ నుండి వస్తున్న సినిమాలా అనుభవించురాజా కనిపించడం లేదు. చిన్న సినిమాలైనా, పెద్ద సినిమాలైనా ఆడియో ఫంక్షనో.. లేదంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ స్టార్ హీరోలని పిలిచి హంగామా చేస్తున్న ఈ రోజుల్లో అనుభవించురాజకి అవి చెయ్యకపోవడం గమనించాల్సిన విషయం. అనుభవించు రాజా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా పెట్టలేదు. జస్ట్ సోలో ఇంటర్వ్యూ, ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ అంటూ ఏదో సరిపెట్టేస్తున్నారు.

Advertisement
CJ Advs

అసలే ప్లాప్స్ లో ఉన్న రాజ్ తరుణ్ కి ఈ సినిమా హిట్ అవడం ముఖ్యం. అలాంటిది ఏ స్టార్ హీరోతోనో అనుభవించు రాజా కి సపోర్ట్ చేయించుకుంటే బావుంటుంది అనేది నెటిజెన్స్ అభిప్రాయం. మరోపక్క అక్కినేని హీరోలు కూడా అనుభవించు రాజాని పట్టించుకున్న పాపాన పోలేదు. అందులోనూ నిర్మాత నాగ్ మేనకోడలు సుప్రియ యార్లగడ్డ. మరి చిన్న సినిమాకే భారీ లెవల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఆడియో వేడుకలని చేస్తున్న ఈ రోజుల్లో అనుభవించురాజకి అలాంటివి లేకుండా కేవలం సోషల్ మీడియా లో ప్రమోట్ చేసేస్తే ఆడియన్స్ కి దగ్గరవుతుంది అనుకున్నారా ఏంది టీం. 

Raj Tarun all his hopes on Anubhavinchu Raja:

Raj Tarun Anubhavinchu Raja Releasing On November 26
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs