జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం గుడ్ లక్ సఖి. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సహ నిర్మాత శ్రావ్య వర్మ నేతృత్వంలో ఎక్కువ మంది మహిళా సభ్యులతో ఈ చిత్రం రూపొందింది.
తాజాగా ఈ సినిమా విడుదలకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఇది వరకు నవంబర్ 26న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ చిత్రాన్ని డిసెంబర్ 10న విడుదల చేయబోతోన్నట్టు మేకర్లు ప్రకటించారు. ఈ మేరకు నిర్మాత సుధీర్ చంద్ర ఓ ప్రకటన చేశారు. పలు కారణాల వల్ల ఈ సినిమాను వాయిదా వేశాం. మరికొన్ని సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి, థియేటర్ల సమస్య ఏర్పడకుండా ఉండేందుకు, భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఇలా అన్ని కోణాల్లో ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. అన్ని విధాలుగా మాకు డిసెంబర్ 10న సరైన తేదీ అనుకున్నాం. ఈ సినిమా మీద మాకు నమ్మకం ఉంది. ప్రేక్షకులందరినీ అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని నమ్ముతున్నామని అన్నారు.