Advertisement
Google Ads BL

జీ 5 ఓటీటీలో శ్రీదేవి సోడా సెంటర్ రికార్డ్


వెబ్ సిరీస్‌లు, డైరెక్ట్‌-టు-డిజిట‌ల్ రిలీజ్‌లు, ఒరిజిన‌ల్ మూవీస్‌, డిజిట‌ల్ రిలీజ్‌లు... ఏవి కావాల‌న్నా వీక్ష‌కులు ముందుగా చూసే ఓటీటీ వేదిక జీ 5. ఒక్క హిందీలో మాత్రమే కాదు...తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వంటి పలు భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకులకు వినోదాన్ని అందిస్తోంది. లాక్‌డౌన్ ఉన్నా, లేకున్నా మన మొబైల్, ట్యాబ్‌, డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌లో జీ 5 ఉంటే చాలు... వినోదానికి లోటు ఉండదు. గత ఏడాది అమృత రామమ్ నుండి మొదలుపెడితే 47 డేస్, మేకా సూరి, బట్టల రామస్వామి బయోపిక్కు, ఇటీవల నెట్ అలాంటి సిత్రాలు వరకూ ఎన్నో సినిమాలను జీ 5 డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్ చేసింది.

Advertisement
CJ Advs

సుధీర్ బాబు, ఆనంది జంటగా నటించిన సినిమా శ్రీదేవి సోడా సెంటర్. కరుణ కుమార్ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన విమర్శకులను మెప్పించడంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దీపావళి కానుకగా జీ 5 ఓటీటీలో ఈ సినిమా విడుదలైంది. వీక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

పరువు కోసం ఓ కన్నతండ్రి ఎంత దారుణానికి ఒడిగట్టారు? తన కులం కాని అమ్మాయిని ప్రేమించిన హీరో ఎన్ని కష్టాలు పడ్డాడు? అనేది సినిమాలో చాలా హృద్యంగా చూపించారు. పరువు హత్యల నేపథ్యంలో తెలుగులో వచ్చిన గొప్ప సినిమా శ్రీదేవి సోడా సెంటర్ అని విమర్శకులు, ప్రేక్షకులు ప్రశంసించారు. ఈ సినిమాను వీక్షకుల ముందుకు తీసుకొచ్చింది జీ 5. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు... ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు అందరికీ సినిమా గురించి తెలిసేలా మార్కెటింగ్ చేసింది. సోషల్ మీడియాలో విపరీతంగా ప్రమోట్ చేసింది. ఓటీటీలో విడుదలైన తర్వాత సక్సెస్ మీట్ నిర్వహించింది. అక్కడ సుధీర్ బాబు, ఇతర తారలతో సెల్ఫీలు తీసుకోవడానికి ప్రేక్షకులు ఎగబడ్డారు.

ఈ సినిమా ఎంత సక్సెస్ సాధించింది అంటే... జీ 5లో విడుదలైన 7 రోజుల్లో 50 మిలియన్ మినిట్స్ స్ట్రీమింగ్ వ్యూస్ సాధించింది. ఈ సందర్భంగా సినిమా బృందానికి కంగ్రాట్స్ చెబుతూ సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ పోస్టర్ విడుదల చేశారు.

భారతదేశంలో నంబర్ 1 ఓటీటీ జీ 5లో తమ సినిమా శ్రీదేవి సోడా సెంటర్ విడుదల కావడం, ఇంత ఘన విజయం సాధించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని చిత్రబృందం తెలిపింది.

Sridevi Soda Center becomes a massive hit on ZEE5:

Sedheer Babu Sridevi Soda Center becomes a massive hit on ZEE5
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs