Advertisement
Google Ads BL

ఆహా స‌రికొత్త గేమ్ షో స‌ర్కార్‌ 3rd ఎపిసోడ్‌


తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్న హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహాలో మ‌రో స‌రికొత్త గేమ్ షో స‌ర్కార్‌(మీ పాటే నా ఆట‌) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. డిజిట‌ల్ మాధ్య‌మంలో థ్రిల్లింగ్‌ను క‌లిగించే స‌రికొత్త గేమ్ షో ఇది. తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన ప్ర‌ముఖ న‌టుడు, ప్ర‌దీప్ మాచిరాజు ఈ గేమ్ షోను హోస్ట్ చేస్తున్నారు. బిడ్డింగ్ నేప‌థ్యంలో సాగే తొలి గేమ్ షో ఇది. ఇందులో ట్విస్టులతో ప్రేక్ష‌కులు థ్రిల్ అవుతారు. టాలీవుడ్‌లోని ప్ర‌ముఖ సెల‌బ్రిటీలంద‌రూ స‌ర్కార్‌ గేమ్ షోలో పాల్గొంటున్నారు. ఎన‌ర్జీ, థ్రిల్, ఫ‌న్, ఎగ్జ‌యిట్‌మెంట్ మైండ్ గేమ్స్‌తో ఈ షో ఆద్యంతం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్న స‌ర్కార్ గేమ్ షో ర్’ గేమ్ షోకు ప్ర‌తివారం ఈ షోకు ప్రేక్ష‌కుల్లో ఆద‌ర‌ణ అంత‌కంత‌కు పెరుగుతోంది. 

Advertisement
CJ Advs

గురువారం(న‌వంబ‌ర్ 11న‌) స‌ర్కార్ మూడ‌వ ఎపిసోడ్ ఆహాలో ప్ర‌సార‌మైంది. సీనియ‌ర్ క‌మెడియ‌న్ అలీ, న‌టులు ప్ర‌వీణ్‌, శ్రీముఖి, మ‌ధు నంద‌న్ ఈ ఎపిసోడ్‌లో పాల్గొన్నారు. స‌ర్కార్ గేమ్‌షోలో వీరి నాలెడ్జ్‌ను టెస్ట్ చేస్తున్నా స‌మాధానాలు ఆసక్తిక‌రంగా చెబుతూ ఆద్యంతం న‌వ్వుల‌తో అల‌రించారు. ఈ షో ప్రోమో నుంచి ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని పెంచింది. అందులో శ్రీవ‌ల్లి పాట‌కు శ్రీముఖి డాన్స్ వేయ‌డం..ఆమెకు ప్ర‌దీప్ కౌంట‌ర్ ఇవ్వ‌డం, అలీ పంచ్‌లు, మ‌ధు నంద‌న్‌, ప్ర‌వీణ్ స‌ర‌దా స‌మాధానాలు ఇవ‌న్నీ షోపై అంచ‌నాల‌ను పెంచితే, అంత‌కు మించిన కామెడీ డోస్‌తో స‌ర్కార్ మూడ‌వ ఎపిసోడ్ ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేసింది. 

స‌ర్కార్‌ లో ప్రతి ఎపిసోడ్‌లో నాలుగు లెవ‌ల్స్ ఉంటాయి. ప్ర‌తి లెవ‌ల్‌లో పార్టిసిపెంట్స్ మూడు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పాల్సి ఉంటుంది. అయితే ప్ర‌తి పార్టిసిపెంట్ స‌మాధానం కోసం వేలం పాట‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ఎవ‌రైతే ఎక్కువ మొత్తంలో చెల్లిస్తారో వారే ఆ ఆన్స‌ర్‌ను సొంతం చేసుకుంటారు. స‌రైన స‌మాధానం చెప్పే ప్ర‌తిసారి అంత‌కు ముందు వారు గెలుచుకున్న మొత్తం రెండింత‌లు కావ‌డం, మూడింత‌లు కావ‌డం, ఆరింత‌లు కావ‌డం ..ఇలా మూడు నాలుగు లెవ‌ల్స్ వ‌ర‌కు గేమ్ కొన‌సాగుతుంది. ప్ర‌తి లెవ‌ల్‌లో త‌క్కువ మొత్తంలో డ‌బ్బుల‌ను క‌లిగి ఉన్న పార్టిసిపెంట్ గేమ్ నుంచి ఎలిమినేట్ అవుతాడు. వెళ్లిపోయేవారు గేమ్‌లో కొన‌సాగుతున్న త‌మ‌కు న‌చ్చిన వారికి ఆ మొత్తాన్ని ట్రాన్స్‌ఫ‌ర్ చేసే సౌల‌భ్యం ఉంటుంది. ఫైన‌ల్‌కు చేరుకున్న ఇద్ద‌రి పార్టిసిపెంట్స్‌లో మూడు ప్ర‌శ్న‌ల‌కు ఎవ‌రైతే త‌క్కువ స‌మ‌యంలో స‌మాధానాలు చెప్పి ఉంటారో వారే గేమ్‌లో గెలిచిన‌ట్లు. జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌, పాలిటిక్స్‌, స్పోర్ట్స్‌, మైథాల‌జీ, మ్యాథ‌మాటిక్స్ వంటి సబ్జెక్స్‌పై ప్ర‌శ్న‌ల‌ను అడుగుతారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్‌గా ఆహా 2.0ను లాంచ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇది ఆహాకు ఆప్‌గ్రేడెడ్ వెర్ష‌న్‌. ఎంతో ఫాస్ట్‌, స్మార్ట్‌గా, వైడ్‌రేంజ్‌లో ప్రేక్ష‌కుల‌కు ఆహాను సౌల‌భ్యాల‌ను అంద చేయ‌నున్నారు. ఆహా 2.0లో డాల్బీ 5.1 ఎక్స్‌పీరియెన్స్‌ను కూడా ఫీల్ కావ‌చ్చు. ఇంకేం కావాలి? మ‌రో వీకెండ్ వ‌చ్చే వ‌ర‌కు ఇప్పుడున్న ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను ఆహాలో ఎంజాయ్ చేయ‌డ‌మే. దీంతో పాటు 2021లో విడుద‌లైన క్రాక్‌, 11 అవ‌ర్త్‌, జాంబిరెడ్డి, ల‌వ్‌స్టోరి, చావు క‌బురు చ‌ల్ల‌గా, నాంది, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్‌, నీడ‌, కాలా, ఆహా భోజ‌నంబు, వ‌న్, సూప‌ర్ డీల‌క్స్‌, చ‌తుర్ ముఖం, త‌ర‌గ‌తి గ‌ది దాటి, ది బేక‌ర్ అండ్ ది బ్యూటీ, మ‌హా గ‌ణేశ‌, ప‌రిణ‌యం, ఒరేయ్ బామ్మ‌ర్ది, కోల్డ్ కేస్‌, ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుపరాదు వంటి సినిమాలు, వెబ్ ఒరిజిన‌ల్స్‌తో తిరుగులేని ఎంట‌ర్టైన్మెంట్‌ను అందిస్తోంది ఆహా.

Aha latest game show Sarkar:

Aha latest game show Sarkar, Amazing response to Ali, Praveen, Srimukhi, Madhunandan 3rd episode
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs