Advertisement
Google Ads BL

అశోక్ గల్లా హీరో రిలీజ్ డేట్ ఫిక్స్


సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనళ్లుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం కాబోతోన్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై శ్రీమతి గల్లా పద్మావతి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

Advertisement
CJ Advs

తాజాగా మేకర్లు ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ మూవీ జనవరి 26న రిలీజ్ కాబోతోంది. ఈ సంధర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో అశోక్ గల్లా యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నారు.

అశోక్‌ గల్లా కు ఇది మొదటి చిత్రమే అయినా కూడా టీజర్‌తోనే ఆకట్టుకున్నాడు. అశోక్ గల్లా బర్త్ డే సందర్భంగా మహేష్ బాబు రిలీజ్ చేసిన టీజర్‌కు విశేష స్పందన లభించింది. ఎంతో పవర్ ఫుల్ రోల్‌లో అశోక్‌  గల్లాను డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య మరింత పవర్ ఫుల్‌గా చూపించారు. నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్రలో అశోక్ గల్లా కనిపించబోతోన్నారు. శ్రీరామ్ ఆదిత్య భిన్న కథలతో భిన్న చిత్రాలను తెరకెక్కించారు. ఇక ఇప్పుడు ఈ హీరో సినిమాను సరికొత్త కథాంశంతో ఎంటర్టైనర్‌గా మలచబోతోన్నారు.

హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి ఈ సినిమాలోని మొదటి పాట అయిన అచ్చ తెలుగందమే లిరికల్ వీడియోను విడుదల చేయగా..  ఆ పాట అందరినీ ఆకట్టుకుంది. సంగీత దర్శకుడు జిబ్రాన్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. త్వరలోనే మిగతా పాటలను  రిలీజ్ చేయనున్నారు.

ఈ సినిమాలో జగపతి బాబు, నరేష్, సత్య, అర్చన సౌందర్య ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

Ashok Galla Hero Release Date Fix:

  Ashok Galla Hero Release on January 26th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs