Advertisement
Google Ads BL

విష్వక్ సేన్ ఓరి దేవుడా


వైవిధ్య‌మైన పాత్ర‌లు, చిత్రాల‌తో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ స్టార్ విష్వ‌క్ సేన్ క‌థానాయ‌కుడిగా, మిథిలా పాల్క‌ర్, ఆశా భ‌ట్ హీరోయిన్స్‌గా న‌టిస్తోన్న న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ ఓరి దేవుడా. ఒక‌వైపు కంటెంట్ బావుంటే మినిమం బ‌డ్జెట్ చిత్రాల‌నైనా, బలుపు వంటి భారీ క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌నైనా, ఊపిరి వంటి ఎమోష‌న‌ల్ ఎంటర్‌టైన‌ర్స్ అయినా, మ‌హ‌ర్షి వంటి మెసేజ్ ఓరియెంటెడ్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌నైనా నిర్మిస్తూ టాలీవుడ్‌లో బ‌డా నిర్మాణ సంస్థ‌గా ఇమేజ్ సంపాదించుకున్న పి.వి.పి సినిమా బ్యాన‌ర్ నిర్మాణంలో అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ఓరిదేవుడా చిత్రం తెర‌కెక్కుతోంది. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు ఈ చిత్రానికి సమ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మంగళవారం ఈ సినిమా టైటిల్ మోష‌న్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. 

Advertisement
CJ Advs

చర్చి ప్రాంగణంలో అందమైన సీతాకోక చిలుక ఎగురుతుంటుంది. దాన్ని ప‌ట్టుకోవ‌డానికి కోటు, సూటు వేసుకున్న‌ హీరో విష్వ‌క్ సేన్ ప్ర‌య‌త్నిస్తుంటే ..పెళ్లి కూతురి డ్రెస్‌లో ఉన్న హీరోయిన్ మిథిలా పాల్క‌ర్ అత‌న్ని ఓ దారంతో క‌ట్టి ఆప‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటుంది. ఓరి దేవుడా చిత్రం ఎంట‌ర్‌టైనింగ్‌గా, రొమాంటిక్‌గా సాగే చిత్ర‌మ‌ని టైటిల్ మోషన్ పోస్టర్ చూస్తుంటే అర్థమవుతుంది. 

ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ మాటలను అందిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీత సారథ్యం వహించారు. విదు అయ్యన్న సినిమాటోగ్రాఫర్‌గా వ‌ర్క్ చేస్తున్న ఈ చిత్రానికి వంశీ కాకా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ దాదాపు పూర్త‌య్యింది. మ‌రో వైపు ఈ సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌ర‌గుతున్నాయి.

Vishwak Sen Ori Devuda First Look :

<span>PVP Cinema, Sri Venkateswara Creations come together for Vishwak Sen-Mithila Palkar-starrer youthful entertainer Ori Devuda&nbsp;</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs