Advertisement
Google Ads BL

నవంబర్ 9న బంగార్రాజు ఫస్ట్ వీడియో


నాగార్జున, రమ్యకృష్ణ కలసి సోగ్గాడే చిన్నినాయన సినిమాతో చేసిన మ్యాజిక్ అందరికీ తెలిసిందే. మరోసారి బంగార్రాజు పాత్రలో రమ్యకృష్ణతో కలిసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు నాగార్జున రెడీ అవుతున్నారు. సోగ్గాడే చిన్ని నాయనతో అందరినీ మెప్పించిన కళ్యాణ్ కృష్ణ ఈ ప్రీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు. నాగ చైతన్య, కృతి శెట్టిలు మరో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Advertisement
CJ Advs

అనూప్ రూబెన్స్ స్వరపరచిన లడ్డుందా అంటూ సాగే ఈ మొదటి పాటను నవంబర్ 9న  విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ చేసిన ప్రోమోలో  నాగార్జున సందడి చేస్తున్నారు. ఈ ప్రోమోలో నాగార్జున తన బృందంతో కలిసి సందడి చేస్తున్నట్టు కనిపిస్తోంది.

అయితే ఇందులో నాగార్జున పక్కన ఉన్నది ఎవరో తెలియడం లేదు. నవంబర్ 9న ఉదయం 9:09 గంటలకు రిలీజ్ కానుంది. పోస్టర్, ప్రోమోను గమనిస్తే ఈ పాట అందరినీ కట్టిపడేసేలా కనిపిస్తోంది.

సోగ్గాడే చిన్నినాయన సినిమాకు అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ఎంతో ప్లస్ అయింది. అందుకే ఈ కాంబినేషన్ మీద ఇంతటి అంచనాలు ఏర్పడ్డాయి. వాటికి తగ్గట్టే అనూప్ రూబెన్స్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

బంగార్రాజును కళ్యాణ్ కృష్ణ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా కుటుంబం మొత్తం కలిసి చూడదగ్గ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులు కోరుకునే అంశాలన్నీ ఇందులో ఉండబోతోన్నాయి.

Bangarraju is coming to bang your playlist with his beats!:

Nagarjuna Bangarraju is coming to bang your playlist with his beats!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs