Advertisement
Google Ads BL

మారెడుమిల్లిలో రవితేజ రామారావు ఆన్ డ్యూటీ


మాస్ మహారాజా రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో శరత్ మాండవ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్‌వీ సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తి కావొస్తుంది. ఫైనల్ షెడ్యూల్  కోసం చిత్రయూనిట్ మారెడుమిల్లి అటవీ ప్రాంతానికి చేరుకుంది. అక్కడ థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అక్కడ షూటింగ్ పూర్తి చేసిన తరువాత విదేశాల్లో పాట‌ల చిత్రీక‌ర‌ణ జ‌రుప‌నున్నారు.

Advertisement
CJ Advs

దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి కీల‌క‌పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో మ‌రికొంత మంది ముఖ్య న‌టీన‌టులు యాక్ట్ చేస్తున్నారు. స్యామ్‌ సీఎస్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సత్యన్ సూర్యన్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటర్‌.

ఈ చిత్రం యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్  పోస్టర్‌కు అద్బుతమైన స్పందన వచ్చింది. ప్రొడక్షన్ వర్క్ పూర్తయిన తరువాత ప్రమోషన్స్ వేగ‌వంతం చేయ‌నున్నారు.

Ravi Teja Ramarao On Duty Shooting In Maredumilli Forest:

Mass Maharaja Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri Ramarao On Duty Shooting In Maredumilli Forest
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs