Advertisement
Google Ads BL

కటారి కృష్ణ ట్రైలర్


దీపావళి సందర్భంగా రొమాంటిక్ సస్పెన్స్ & యాక్షన్ థ్రిల్లర్ కటారి కృష్ణ ట్రైలర్ విడుదల

Advertisement
CJ Advs

Click Here Video: Katari Krishna Movie Trailer Launch 

జాగో స్టూడియో పతాకంపై కృష్ణ, చాణక్య, రేఖా నిరోష, యశ్న చౌదరి, స్వాతి మండల్, చంద్రశేఖర్ తిరుమలశెట్టి, పోసాని కృష్ణ మురళి, మిర్చి మాధవి, టి ఎన్ ఆర్, డి ఎస్ రావు నటీనటులుగా ప్రకాష్ తిరుమల శెట్టిని దర్శకుడిగా పరిచయం చేస్తూ పి.ఏ. నాయుడు, నాగరాజు తిరుమల శెట్టి సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న రొమాంటిక్  యాక్షన్ థ్రిల్లర్ కటారి కృష్ణ. దీపావళి సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్ ను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో సినీ అతిరదుల సమక్షంలో ఘనంగా జరుపు కున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతి ధులుగా వచ్చిన సీనియర్ నటుడు, నిర్మాత మురళీ మోహన్ గారు చిత్ర ట్రైలర్ ను విడుదల చేయగా, తనికెళ్ల భరణి పాటలను విడుదల చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో, గౌతంరాజు, చిత్ర యూనిట్ తదితరులు పాల్గొన్నారు. 

నటుడు,నిర్మాత మురళీ మోహన్ గారు మాట్లాడుతూ.. జాగో స్టూడియో పై కొత్త టీం తో అద్భుతమైన చిత్రాన్ని నిర్మించారు చిత్ర నిర్మాతలు. ఇంతకు ముందు సినిమా అంటే కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమిత మయ్యేది. కానీ ఇవాళ్టి రోజున తెలుగు ఇండస్ట్రీకు కొత్త బ్లడ్ చాలా వచ్చింది. అందుకే ఈనాడు  ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న తెలుగు సినిమాకు మంచి గుర్తింపు లభించడమే గాక తెలుగు ఇండస్ట్రీ ఇంత గొప్పగా ఉంటుందా అనే స్టేజ్ కు ఎదిగింది.అందుకే కొత్త ఆలోచనలతో వస్తున్న ఇలాంటి కొత్త దర్శకులకు, కథా రచయితలు, టెక్నీషియన్స్ కు అవకాశం కల్పిస్తే కొత్త కొత్త కాన్సెప్ట్ ఉన్న కథలు ప్రేక్షకుల ముందుకు వచ్చి గొప్ప విజయం సాధిస్తాయి. కటారి కృష్ణ ట్రైలర్ చాలా బాగుంది. రొమాంటిక్ సస్పెన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించి ఈ చిత్ర  యూనిట్ కు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. మా కాలంలో దర్శకుడు అవ్వాలంటే చాలా కష్ట పడవలసి వచ్చేది. కానీ ఈ రోజు డిజిటల్ మీడియా పెరగడంతో కొత్తకొత్త కథలతో యూత్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రేక్షకులు మెచ్చే కథతో సినిమా చేస్తే అడకపోవడం అనే బాధ లేకుండా థియేటర్స్ లతో పాటు ఓటిటి లో కూడా విడుదల చేసి మంచి పేరు సంపాదించు కుంటున్నారు.యూత్ కు మెచ్చే విధంగా తీసిన ఈ చిత్ర ట్రైలర్,పాటలు బాగున్నాయి త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు. 

చిత్ర నిర్మాతలు పి.ఏ.నాయుడు, నాగరాజు తిరుమల శెట్టి లు మాట్లాడుతూ.. దర్శకుడు కోత్తవాడైనా తను చెప్పిన కొత్త కాన్సెప్ట్ కథ మాకు నచ్చడంతో ఈ చిత్రానికి తనను దర్శకునిగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మి స్తున్నాము. వైవిధ్యమైన కథాంశంతో రొమాంటిక్ సస్పెన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా  రూపొందించిన ఈ చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ లు, చేజింగ్ సీక్వెన్స్ లు, మరియు థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ ఎన్నో ఉన్న ఈ చిత్రం ప్రేక్షకులందరికీ తప్పక నచ్చుతుంది. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ చివరివారంలో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. 

చిత్ర దర్శకుడు ప్రకాష్ తిరుమలశెట్టి మాట్లాడుతూ.. కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడమే కాకుండా ముఖ్యంగా యూత్ ని బాగా ఆకట్టుకునే అంశాలతో ఈ చిత్రం రూపొందింది. ఇలాంటి మంచి సబ్జెక్ట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. 

చిత్ర హీరో కృష్ణ మాట్లాడుతూ.. ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలని అన్నారు.

నటీనటులు: హీరో కృష్ణ, హీరో చాణిక్య, హీరోయిన్స్ రేఖ నిరోష, యశ్న చౌదరి, స్వాతి మండల్, చంద్రశేఖర్ తిరుమలశెట్టి, పోసాని కృష్ణ మురళి తదితరులు.

Katari Krishna Movie Trailer Launch:

<span>Katari Krishna Movie Trailer Launch</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs