Advertisement
Google Ads BL

పెద్దన్న సూపర్ స్టార్ సినిమాలా ఉంటుంది


సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయిన పెద్దన్న సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4న రాబోతోంది. టాలీవుడ్‌ డిస్ట్రిబ్యూషన్ రంగంలో అగ్రగామి అయిన ఏసియన్ ఇన్ ఫ్రా ఎస్టేట్స్ ఎల్ఎల్‌పి సంస్థ, సురేష్ బాబు కలిసి ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శివ సినిమా విశేషాలను పంచుకున్నారు..

Advertisement
CJ Advs

పెద్దన్న సినిమా రేపు విడులవబోతోంది..ప్ర‌స్తుతం మీ ఫీలింగ్ ఎలా ఉంది?

- చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. ఫస్ట్ టైం సూపర్ స్టార్ రజినీకాంత్‌ గారితో పని చేశాను. సన్ పిక్చర్స్, సురేష్ బాబు గారి వంటి వారితో పని చేశాను. సినిమా షూటింగ్ అంతా కూడా ఎంతో సరదాగా గడచింది. ఇక సినిమా విడుదల అవుతోందని ఎంతో సంతోషంగా ఉంది.

ఈ ప్రాజెక్ట్ ఎలా మొదలైంది?

- నేను డైరెక్ట్ చేసిన విశ్వాసం సినిమా చాలా పెద్ద హిట్ అయింది. అప్పుడు రజినీ కాంత్ గారు పిలిచారు.  నాతో ఎలాంటి సినిమా చేయాలని అనుకుంటున్నావ్? అని రజినీకాంత్ గారు అడిగారు. సూపర్ స్టార్ లాంటి సినిమా చేయాలని అనుకుంటున్నానని చెప్పాను. సూపర్ స్టార్ సినిమా అంటే ఏంటి? అని నవ్వుతూ అడిగారు. అన్ని రకాల ఎమోషన్స్‌తో కమర్షియల్‌గా ఉంటే అది సూపర్ స్టార్ సినిమా అని చెప్పాను. సరే అలాంటిదే చేద్దాం అన్నారు. ఫస్ట్ నెరేషన్‌లోనే కథ బాగా నచ్చింది. అలా సినిమా మొదలైంది. సన్ పిక్చర్స్, కళానిధి మారన్, కావ్యా మేడంలతో పని చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమా మీద వారికున్న నమ్మకమే నన్ను నడిపించింది. చాలా రోజుల తరువాత మళ్లీ ఫుల్ ఫిల్ సినిమా చూసినట్టు అనిపిస్తుంది.

షూటింగ్ స‌మ‌యంలో రజినీకాంత్ గారు ఎలాంటి ప్రశంసలు ఇచ్చారు?

- షూటింగ్ అంతా కూడా సరదాగానే జరుగుతూ ఉంటుంది. మంచి సీన్లు చేస్తే.. అందరి ముందే ప్రశంసించేవారు. సినిమా బాగా తీస్తున్నాడని అన్నారు. అయితే కొంత సినిమాను ఎడిట్ చేసి చూపించాను. నా సినిమా చూసినట్టు అనిపిస్తోందని రజినీకాంత్ గారు అన్నారు. ఆ తరువాత సినిమా మొత్తం చూశారు. బయటకు వచ్చి నన్ను హత్తుకుని ముద్దు పెట్టుకున్నారు. అది నేను ఎప్పటికీ మరిచిపోను. ఎంతో సంతృప్తితో ఆయన అలా చేశారు. అదే నాకు అతి పెద్ద ప్రశంస.

ఈ సినిమాలో మిగతా నటీనటుల గురించి  చెప్పండి?

- ఈ చిత్రంలో చాలా మంది యాక్ట‌ర్స్‌ ఉన్నారు. చెప్పుకుంటూ వెళ్తే అలా పెద్ద కాస్టింగ్ ఉంటుంది. నయనతార, మీనా, కుష్బూ, జగపతి బాబు ఇలా చాలా మంది ఉన్నారు. అన్ని పాత్రలు చాలా బాగా వచ్చాయి.

మీ సినిమాలో భారీ తారాగణం, ఎక్కువ సందడి వాతావరణం ఉంటుంది? దానికి కారణం ఏంటి?

- నాకు  సినిమా అంటే సెలెబ్రేషన్స్. సందడిగా ఉండాలనే అలా తీస్తాను. పండుగకు అందరూ సినిమాకు వెళ్తున్నామంటే.. అలాంటి సినిమానే తీయాలి. మాది ఉమ్మడి కుటుంబం. పెద్ద వాళ్ల నుంచి చిన్న వాళ్ల వరకు అందరూ వెళ్లేవాళ్లం. అలాంటి సినిమాను ఇప్పుడు తీయడం నాకు చాలా ఆనందంగా ఉంది. కుష్బూ, మీనా గారు కూడా ఈ ప్రాజెక్ట్‌లోకి రావడం సంతోషంగా అనిపించింది. సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ వైబ్స్ వచ్చాయి.

ఈ సినిమా చూశాక మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి?

- సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ బ్లాక్ బస్టర్ హిట్ అని అంటున్నారు. కానీ రజినీకాంత్ గారు సినిమా చూశాక వచ్చి కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం ఎప్పటికీ మరిచిపోలేను. ఆయన సంతోషాన్ని, ప్రేమను అలా వ్యక్తపరిచారు. అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్.

టీజర్, ట్రైలర్ అన్నింటికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది క‌దా?

- నేను రజినీ గారికి వీరాభిమానిని. ఓ అభిమానిలానే సినిమాను తీశాను. అయినా మనం చేసేది ఏం ఉండదు. అంతా దేవుడే చేస్తాడు. మనం ఓ పరికరం మాత్రమే. నేను చిన్నప్పటి నుంచి నేను అలానే అనుకుంటాను.

న‌య‌న‌తార రోల్ గురించి చెప్పండి?

- చంద్రముఖి సినిమా నుంచి వీరి కాంబినేషన్ బాగుంది.  విశ్వాసం సినిమాలో నయనతార అద్భుతంగా నటించారు. రజినీకాంత్ గారు, నయనతార, నేను కలిసి చేస్తే బాగుంటుందని అనుకున్నాను. నయన్ గారు నాకు మంచి ఫ్రెండ్. ఆమె కథ చెప్పగానే ఓకే చెప్పారు.

పెద్దన్నలో రజనీకాంత్ ఎలా కనిపిస్తారు?

- అభిమానులు రజినీకాంత్ గారిని ఎలా చూడాలని అనుకుంటున్నారో.. అలా ఉంటారు. ఆయన్నుంచి కోరుకునే మాస్, యాక్షన్ అన్నీ రకాలుగా అభిమానులకు ట్రీట్ ఇచ్చేలానే కనిపిస్తారు.

ముగ్గురు పెద్ద నిర్మాతలు కలిసి ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు? మీ ఫీలింగ్ ఏంటి?

- నాకు ముగ్గురు నిర్మాతలు చాలా బాగా తెలుసు. సురేష్ బాబు గారితో అయితే ముందు నుంచి ట్రావెల్ చేస్తున్నాను. నా శౌర్యం కథ ఆయనకే మొద‌ట చెప్పాను. నా కెరీర్‌‌లో ఆయనకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. సునీల్ గారు, దిల్ రాజు గారి కలిసి సినిమాను విడుదల చేస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. రేపు ఈ సినిమా విడుదలయ్యాక, ఫలితాన్ని చూశాక కూడా సంతోషంగానే ఉంటారు

Kollywood Director Shiva Interview:

Kollywood Director Shiva Interview about Peddanna 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs