Advertisement
Google Ads BL

థియేటర్‌ లకు మంచి రోజులు వచ్చాయి


మంచి రోజులు వచ్చాయి పెయిడ్ ప్రీమియర్స్‌ హౌజ్ ఫుల్.. 

Advertisement
CJ Advs

యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా వరస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు మారుతి రూపొందిస్తున్న కొత్త సినిమా మంచి రోజులు వచ్చాయి. దీపావళి సందర్భంగా నవంబరు 4న మంచి రోజులు వచ్చాయి సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ మధ్యే విడుదలైన రిలీజ్ ట్రైలర్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్స్ సంచలనం రేపుతున్నాయి. అన్నిచోట్ల హౌజ్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. ప్రీమియర్స్ టికెట్స్ అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైపోవడం గమనార్హం. వైజాగ్, ఏలూరు, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు తదితర నగరాల్లో నవంబర్ 3 రాత్రి పేయిడ్ ప్రీమియర్స్ ఏర్పాటు చేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ డిమాండ్‌పై భీమవరంలో కూడా షో వేస్తున్నారు. ఈ స్పెషల్ ప్రీమియర్ బుకింగ్ ఓపెన్ అయిన వెంటనే టికెట్స్ అన్నీ సూపర్ ఫాస్టుగా అయిపోయాయి. మిగిలిన చోట్ల కూడా ప్రీమియర్స్‌కు హౌజ్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి.

హైదరాబాద్, కడపలో కూడా ఎక్స్ ట్రా షోలు వేస్తున్నారు. మొత్తం 15 చోట్ల ఈ ప్రీమియర్స్ ఏర్పాటు చేస్తున్నారు. అన్నింటికి హౌజ్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్ ఐమాక్స్ థియేటర్‌లో స్క్రీన్స్ పెంచే అవకాశం కూడా కనిపిస్తోంది. కేవలం ప్రీమియర్స్‌తోనే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. సందేశం, వినోదం కలిపి ఇవ్వడంలో దర్శకుడు మారుతి ఆరితేరిపోయారు. ఈ సినిమాను వి సెల్యులాయిడ్ SKN నిర్మిస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన కంటెంట్‌కి సూపర్ రెస్పాన్స్ రావడంతో పాటు ప్రీమియర్స్ అన్నీ హౌజ్ ఫుల్ అవుతుండటం శుభ పరిణామం. దాంతో భారీ అంచనాల మధ్య దీపావళికి మంచి రోజులు వచ్చాయి విడుదలవుతుంది.

Manchi Rojulochaie November 4th Release:

Manchi Rojulochaie Paid Premieres House Ful
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs