Advertisement
Google Ads BL

గ్యాంగ్ స్టర్ గంగ రాజు షూటింగ్ పూర్తి


వలయం చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న లక్ష్ చదలవాడ హీరోగా రూపొందుతోన్న తదుపరి చిత్రం గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకం పై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో మంచి అభిరుచి గల నిర్మాత పద్మావతి చదలవాడ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Advertisement
CJ Advs

డిఫరెంట్ కథాంశంతో కమర్షియల్ హంగులతో రూపొందుతోన్న గ్యాంగ్ స్టర్ గంగ రాజు చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్. అలాగే సంగీత దర్శకుడు సాయి కార్తీక్ సమకూర్చిన పాటలకు ప్రేక్షకుల నుండీ మంచి రెస్పాన్స్ లభించింది. ఇక ఇటీవల విడుదలైన గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు ఫుల్ టైటిల్ వీడియో సాంగ్ కూడా యూట్యూబ్లో దూసుకుపోతుండడం మరో విశేషం. ఇక ఇటీవల జరిగిన షెడ్యూల్ తో గ్యాంగ్ స్టర్ గంగరాజు షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. సినిమాకి సాయి కార్తీక్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి డిసెంబర్లో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్టు చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తుంది.

న‌టీనటులు: ల‌క్ష్ చ‌ద‌ల‌వాడ‌, వేదిక ద‌త్త‌, వెన్నెల కిషోర్‌, చ‌ర‌ణ్ దీప్‌, శ్రీకాంత్ అయ్యంగార్, గోప‌రాజు ర‌మ‌ణ‌, నిహార్ క‌పూర్‌, రాజేశ్వ‌రి నాయ‌ర్‌, స‌త్య‌కృష్ణ‌, ర‌వితేజ‌, న‌న్నిమాల‌, స‌మ్మెట గాంధీ, రాజేంద్ర‌, అను మాన‌స‌, లావ‌ణ్య రెడ్డి, అన్న‌పూర్ణ త‌దిత‌రులు.

సాంకేతిక వ‌ర్గం: ద‌ర్శ‌క‌త్వం: ఇషాన్ సూర్య‌, నిర్మాత‌: చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి, బ్యాన‌ర్‌: శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్, సినిమాటోగ్ర‌ఫీ: క‌ణ్ణ పి.సి, సంగీతం: సాయి కార్తీక్‌, ఎడిట‌ర్‌: అనుగోజు రేణుకా బాబు, ఫైట్స్‌: డ్రాగ‌న్ ప్ర‌కాశ్‌, కొరియోగ్రాఫ‌ర్స్‌: భాను, అనీష్‌, పి.ఆర్‌.ఓ: సాయి స‌తీశ్‌, ప‌ర్వ‌త‌నేని రాంబాబు.

Gangster Gangaraju Shooting Completed:

<span>Gangster Gangaraju Shooting Completed</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs