Advertisement
Google Ads BL

ఫ్యామిలీ డ్రామా సక్సెస్ చేశారు - హీరో సుహాస్


సుహాస్ హీరోగా నటించిన కొత్త సినిమా ఫ్యామిలీ డ్రామా. మ్యాంగో మాస్‌ మీడియా సమర్పణలో తేజా కాసరపుతో కలిసి మెహెర్‌ తేజ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. తేజ కాసరపు, పూజా కిరణ్‌, అనూష నూతుల, శ్రుతి మెహర్‌, సంజయ్‌ రథా తదితరులు కీలక పాత్రలు పోషించారు. సోని లివ్ ఓటీటీలో గత నెల 29 తేది నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. డార్క్ కామెడీ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చడం సంతోషంగా ఉందంటున్నారు హీరో సుహాస్, దర్శకుడు మెహెర్ తేజ్. ఫ్యామిలీ డ్రామా కు మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో పాత్రికేయులతో తమ సంతోషాన్ని పంచుకున్నారు. 

Advertisement
CJ Advs

దర్శకుడు మెహెర్ తేజ్ మాట్లాడుతూ...రెండేళ్లుగా ఈ కథ మీద డిస్కషన్స్ చేస్తున్నాము. కలర్ ఫొటో సినిమా షూటింగ్ సుహాస్ ఉన్నప్పుడు వెళ్లి కథ చెప్పాను. సుహాస్ కంటే ముందు మరో నటుడిని ఈ క్యారెక్టర్ కు అనుకున్నా కుదరలేదు. క్యారెక్టరైజేషన్, కథ నచ్చి సుహాస్ ఈ సినిమా చేసేందుకు ముందుకొచ్చారు. డార్క్ కామెడీ జానర్ లో మన దగ్గర సినిమాలు రావడం తక్కువ. అయితే ఈ జానర్ లో వరల్డ్ వైడ్ మూవీస్ బాగా ప్రేక్షకాదరణ పొందాయి. మన దగ్గర కూడా చేస్తే బాగుంటుంది అనిపించింది. రామ్ గోపాల్ వర్మ, హిచ్ కాక్ లాంటి దర్శకులు నన్ను ఇన్ స్పైర్ చేశారు. వాళ్ల సినిమాల తరహా స్క్రీన్ ప్లే స్ఫూర్తితో ఫ్యామిలీ డ్రామా చిత్రాన్ని రూపొందించాను. సినిమా చేసేప్పుడు ఇది ఒక టైప్ ఆఫ్ ఆడియెన్స్ కు మాత్రమే నచ్చుతుందని అనుకున్నాం. కానీ ఇవాళ ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా మా చిత్రాన్ని చూస్తుండటం, ఆదరిస్తుండటం సంతోషంగా ఉంది. సుహాస్ చక్కగా పర్మార్మ్ చేశాడు. ప్రతి సీన్ కూడా ముందు ప్రాక్టీస్ చేసి తెరకెక్కించిందే. సుహాస్ సహా మిగతా ఆర్టిస్టులు అంతా వర్క్ షాప్స్ చేశారు. ఉన్న క్యారెక్టర్ లలో చాలా మంది థియేటర్ ఆర్టిస్టులే. దాంతో పిక్చరైజేషన్ ఈజీగా, త్వరగా అయ్యింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ప్లాన్ చేసి పెట్టాం. దానికీ మంచి రెస్పాన్స్ వస్తోంది. నా కొత్త సినిమా డిస్కషన్స్ లో ఉంది. డీటెయిల్స్ త్వరలో చెబుతాను. అన్నారు.

సుహాస్ మాట్లాడుతూ...ఫ్యామిలీ డ్రామా సక్సెస్ అవడం చాలా సంతోషంగా ఉంది. వాస్తవంగా ఈ సినిమాకు, నా క్యారెక్టరైజేషన్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అని భయపడ్డా. కామెంట్స్ చదవడానికి కూడా భయమేసింది. కానీ మొత్తంగా మా చిత్రాన్ని ఆడియెన్స్ రిసీవ్ చేసుకున్నారు. నేను బాగా నటించాను అని చెప్పడం ఆనందంగా ఉంది. కలర్ ఫొటో లాంటి హిట్ సినిమా తర్వాత ఇంకో కొత్త టైప్ ఆఫ్ సినిమా చేద్దామని ఫ్యామిలీ డ్రామాలో నటించాను. నటుడిగా నాకు కొత్త అనుభూతిని ఇచ్చింది. గట్టిగా నవ్వడం, ఎమోషన్స్ పలికించే సందర్భాల్లో కష్టపడి నటించాను. ఒక్కోసారి తలనొప్పి వచ్చేది. ఫ్యామిలీ డ్రామా కుటుంబ ప్రేక్షకులు కూడా చూస్తున్నారంటే సర్ ప్రైజింగ్ గా, సంతోషంగా ఉంది. కొన్ని సీన్స్ చేసేప్పుడు ఉద్వేగానికి గురయ్యాను. నటుడిగా అన్ని రకాల కథల్లో, క్యారెక్టర్లలో నటించాలి అనేదే నా కోరిక. రైటర్ పద్మ భూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లాంటి చిత్రాల్లో నటిస్తున్నాను. ప్రస్తుతం నాలుగు చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి. ఫ్యామిలీ డ్రామా చిత్రంతో నా ఇమేజ్ మారుతుందని అనుకోవడం లేదు. నా జర్నీలో ఇదో తరహా సినిమా అంతే. త్వరలో రాబోతున్న చిత్రాలతో నేను అన్ని రకాల క్యారెక్టర్స్ చేస్తానని తెలుస్తుంది. అన్నారు.

Suhas Family Drama Press Meet :

Family Drama Press Meet 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs