Advertisement
Google Ads BL

మంచి రోజులు వ‌చ్చాయి ప్రీ రిలీజ్ ఈవెంట్


సంతోష్ శోభన్, మెహరీన్ కౌర్ జంటగా వరుస విజయాలతో దూసుకుపోతున్న మారుతి తెరకెక్కిస్తున్న సినిమా మంచి రోజులు వచ్చాయి. నవంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. యాక్షన్ హీరో గోపీచంద్, అల్లు అరవింద్ గారు ముఖ్య అతిథులుగా వచ్చిన ఈవెంట్ విశేషాలు ఏంటో చూద్దాం..

Advertisement
CJ Advs

హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ.. కేవలం నా టాలెంట్ నమ్మి మళ్లీ మళ్లీ నాకు అవకాశాలు ఇస్తున్న యు.వి.కాన్సెప్ట్స్ కు జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ స్టేజ్ ఎక్కడానికి ఎంతో కష్టపడ్డాను. మంచి రోజులు వచ్చాయి ఖచ్చితంగా అందరినీ అలరిస్తోంది. నవంబర్ 4న థియేటర్స్ అన్నీ నవ్వులతో నిండిపోవాలి అని కోరుకుంటున్నాను.. అని తెలిపారు.

హీరో గోపీచంద్ మాట్లాడుతూ.. మారుతి సినిమా అంటే నవ్వులు గ్యారెంటీ. అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నాను అనేది రేపు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను.. మీకు కూడా రేపు నవంబర్ 4న థియేటర్లలో అది తెలుస్తుంది. సినిమా అంతా పగలబడి నవ్వడం ఖాయం. మంచి రోజులు వచ్చాయి పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. అని తెలిపారు.

దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. కరోనా తర్వాత అందరు తెలియకుండానే ఒక భయంలోకి వెళ్లిపోతున్నారు. ఆ భయం మీద ఎందుకు సినిమా చేయకూడదు అనే ఐడియా నాకు వచ్చింది. అది వచ్చిన వెంటనే 20 రోజుల్లో కథ రాసి.. 30 రోజుల్లో సినిమా తీశాను. ముందు నా పేరు వేసుకోకూడదు అనుకున్నాను. కానీ ఒక మంచి విషయం చెబుతున్నప్పుడు దాని ఫలితం కూడా మనమే తీసుకోవాలని అల్లు అరవింద్ గారితో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నాను. సాధారణంగా ఒక పెద్ద సినిమా చేస్తున్నప్పుడు చిన్న సినిమా చేయాలి అంటే నిర్మాతలు ఒప్పుకోరు. కానీ నేనేం చేసినా కూడా నా వెనక మంచి మనుషులు ఉన్నారు. ఆ ధైర్యంతోనే మంచి రోజులు వచ్చాయి సినిమా మీ ముందుకు తీసుకు వస్తున్నాను. ఈ సినిమా సరదాగా చేసినా.. సీరియస్ విషయం ఉంది. ఖచ్చితంగా నవంబర్ 4న థియేటర్లలో మీరు ఈ సినిమా చూసి నవ్వుతారు.. ఎంజాయ్ చేస్తారు అని నమ్ముతున్నాను.. అని తెలిపారు.

నిర్మాత అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ.. సినిమా వాళ్లకు మంచి రోజులు రావడం అంటే జనం థియేటర్స్ కు వచ్చి ఆశీర్వదించడం. ఈ మధ్య విడుదలైన రెండు మూడు సినిమాలకు అలాంటి మంచి రోజులు చూపించారు. నేను ఓటిటి ఓనర్ అయ్యుండి కూడా సినిమాను తెరమీదే చూడండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. మారుతి నాకు బన్నీ ఫ్రెండ్ గా తెలుసు. మా ఇంట్లో కుర్రాడి కింద చూస్తాం. ఎంటర్టైన్మెంట్ లోనే సందేశం ఇచ్చే దర్శకుడు మారుతి. శోభన్ నీ గురించి పేపర్ బాయ్ ఈవెంట్ లోనే చెప్పాను. నువ్వు గీతా ఆర్ట్స్ లో సినిమా చేయాలి. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఇండస్ట్రీలో టాలెంటు లేకపోతే ఎత్తుకోదు. నీకు చాలా టాలెంట్ ఉంది. మెహరీన్ నువ్వు స్వీట్ హార్ట్. స్టార్ హీరోలు ముందుకొచ్చి చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నారు. అది చాలా మంచి సంప్రదాయం. ఇప్పుడు ఇండస్ట్రీకి చాలా అవసరం. మంచి రోజులు మనకు ముందున్నాయి.. అని తెలిపారు

Manchi Rojulochaie Pre Release Event:

Maruthii Manchi Rojulochaie Pre Release Event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs