Advertisement
Google Ads BL

రాజబాబు సంస్మరణ సభ


నటుడు బి రాజబాబు పేరుతో అవార్డులు క్యారెక్టర్ నటుడు రాజబాబు పేరుతో నాటక రంగంలోనూ, టీవీ రంగంలోనూ అవార్డులను ప్రదానం చేస్తామని, వచ్చే సంవత్సరం రాజబాబు జన్మదినోత్సవం సందర్భంగా నాటకోత్సవాలను నిర్వహిస్తామని, ఆ సందర్భగా రంగస్థలంలో ప్రతిభావంతులను గుర్తించి అవార్డు ప్రదానం చేస్తామని నవ్య మీడియా డైరెక్టర్ కె .వి .బ్రహ్మం తెలిపారు. సినిమా, టీవీ నటుడు రాజబాబు సంస్మరణ హైదరాబాద్ ఫిలిం నగర్ లోని నిర్మాతల మండలి హాలులో గురువారం జరిగాయి.

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా రాజబాబు కు సన్నిహితుడు కె.వి. బ్రహ్మం మాట్లాడుతూ.. రాజబాబు నాకు అత్యంత ఆత్మీయుడు, ఆయనతో నా అనుబంధం 1995 నుంచి కొనసాగుతుంది. రాజబాబు ఇక లేడనే వార్త ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. రాజబాబు కలకాలం గుర్తుండిపోవాలనే ఉద్దేశ్యంతో ఆయన పేరుతో నాటకోత్సవాలను నిర్వహించాలనుకుంటున్నా, నిపుణులైన వారితో ఒక కమిటీ వేసి నాటకాలను ఎంపిక చేస్తాము. ఒక సంవత్సరం ఆంధ్ర ప్రదేశ్ లోను, మరో సంవత్సరం తెలంగాణ లోను భారీ స్థాయిలో నిర్వహిస్తాము. ఎంపికైన నాటకాలు, నటీనటులకు నగదు బహుమతులు ఉంటాయి. అలాగే రాజబాబు స్మారక అవార్డుకు ఎంపిక చేసే నటుడిని సత్కరించి అవార్డు తో పాటు భారీ నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. అలాగే రాజబాబు టీవీ రంగంలోనూ ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అందుకే టీవీ రంగంలోనూ రాజబాబు పేరుతో అవార్డు, నగదు బహుమతి కూడా ఇవ్వలేనని సంకల్పించాము. ఇందుకు రాజబాబు చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని బ్రహ్మం ప్రకటించారు.

నిర్మాతల మండలి కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. సంస్మరణ సభలకు రావడానికి ఎవరూ ఆసక్తి చూపించడం లేదు, కానీ రాజబాబు కోసం ఏర్పాటుచేసిన సభలో ఇంతమంది ఆత్మీయులు పాల్కొనడం ఆశ్చర్యంగా, ఆనందంగా ఉందని, రాజబాబు ఎంత మంది ఆత్మీయులను సంపాదించుకున్నారని, ఇది అందరూ గమనించాలని చెప్పారు.  

నిర్మాత ఆచంట గోపినాథ్ మాట్లాడుతూ.. సినిమా, టీవీ రంగాల్లో పేరు సంపాదించిన రాజబాబు చనిపోవడం బాధాకరమని, ఆయన వ్యక్తిత్వం స్ఫూర్తిదాయకమని చెప్పారు. నటుడు రామ్ జగన్ మాట్లాడుతూ.. రాజబాబు అహం, ఆడంబరం లేని నటుడని, అందరితో ఎంతో సరదాగా ఉంటాడని, ఆయన గూర్చి ఇలా మాట్లాదాల్చి వస్తుందని అనుకోలేదని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నా అన్నారు. నటుడు కౌశిక్ మాట్లాడుతూ.. నటనలో శిక్షణ ఇచ్చింది ఉప్పుపాటి నారాయణ రావ్ గారైతే సినిమా, టీవీ రంగంలో నిలబడటానికి ఆత్మ ధైర్యం ఇచ్చింది మాత్రం బాబాయ్ రాజబాబు గారే అని చెప్పారు. ప్రొఫెసర్ అంజిరెడ్డి మాట్లాడుతూ.. బ్రహ్మం ద్వారా పరిచయం అయిన రాజబాబు నాటు అత్యంత ఆత్మీయుడయ్యారు, మా అమ్మాయి వివాహంలో రాజబాబు నిర్వహించిన పాత్ర ఇప్పటికీ మర్చిపోలేను అని చెప్పారు.

రాజబాబు కుమారుడు రమేష్ మాట్లాడుతూ.. నాన్న కోసం ఇంతమంది తమ అనుభవాలు చెబుతూ ఉంటే కళ్ళు చమర్చుతున్నాయని, నాన్న లేని లోటు ఎప్పటికీ భర్తీ కాదని చెప్పారు. సీనియర్ జర్నలిస్ట్ భగీరథ మాట్లాడుతూ.. మా అందరికీ ఆప్తుడు రాజబాబు, ఆయన హఠాత్తుగా వెళ్ళిపోతారని ఊహించలేదు. ఆయన సినిమా టీవీ రంగాల్లో ఎంతో మంది ఆత్మీయులను సంపాదించుకున్నారు, రాజబాబుతో వారి అనుభవాలు పంచుకోవాలనే  ఉద్దేశ్యం తోనే ఈ సంస్మరణ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశామని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో రవి కనగాల, రమేష్ రావు, సూర్యతేజ తో పలువురు రాజబాబుతో తమకున్న అనుభవాలను పంచుకున్నారు, సంస్మరణ సభను నటుడు శశాంక నిర్వహించి రాజబాబుతో తనకున్న అనుభవాలను పంచుకున్నారురాజబాబు సంస్మరణ కార్యక్రమాన్ని నవ్య మీడియా ఆధ్వర్యంలో  కె.వి .బ్రహ్మం, నర్రా వెంకట రావు, దేవకుమార్ వేములపల్లి, డాక్టర్ రఘునాథ బాబు, బాలాజీ మరియు భగీరథ నిర్వహించారు.

B.Raja Babu Samsmarana Sabha:

B.Raja Babu Samsmarana Sabha
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs