Advertisement
Google Ads BL

తీస్ మార్ ఖాన్ గోవాలో రొమాంటిక్ సాంగ్

tees maar khan,tees maar khan movie,aadi saikumar,payal rajput,sunil, | తీస్ మార్ ఖాన్ గోవాలో రొమాంటిక్ సాంగ్

చిత్రీకరణ తుది దశలో ఆది సాయి కుమార్ తీస్ మార్ ఖాన్.. గోవాలో రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ

Advertisement
CJ Advs

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం తీస్ మార్ ఖాన్. విజ‌న్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగం తిరుప‌తి రెడ్డి ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. గ్లామరస్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కథానాయికగా నటిస్తుంది. హై యాక్షన్ వోల్టేజ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కి కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహిస్తుండగా ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయ్యి మంచి ప్రేక్షకాదరణ అందుకుంది. అంచనాలకు తగ్గట్లుగా ఈ లుక్ ప్రేక్షకులను బాగా అలరించింది. హీరో ఆది సాయి కుమార్ పవర్ ప్యాక్డ్ లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 

మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలు పోషిస్తున్న సాయి కుమార్ ఈ పోస్టర్ లో నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో కనిపించి అందరినీ అలరించారు. పాయ‌ల్ రాజ్‌పుత్ పాత్ర ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె చేసిన చిత్రాల‌కు భిన్నంగా, ఇది వ‌ర‌కు చూడ‌ని స‌రికొత్త క్యారెక్ట‌ర‌రైజేష‌న్‌తో అటు గ్లామ‌ర్ ప‌రంగా, ఇటు పెర్ఫామెన్స్ ప‌రంగా ఆక‌ట్టుకోనుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా చిత్రీక‌ర‌ణ గోవాలో జరుగుతుంది. హీరో, హీరోయిన్స్‌పై మంచి రొమాంటిక్ సాంగ్‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఆది సాయికుమార్ డాన్స్‌, పాయల్ రాజ్ పుత్ గ్లామర్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణ కాగా సినిమా మొత్తానికి ఈ పాట హైలైట్ గా నిలవనుంది. విజన్ సినిమాస్ పతాకంపై  ఈ సినిమా ను నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తుండగా  సాయి కార్తీక్ సంగీతం సమకూరుస్తున్నారు. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మణికాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. త్వరలోనే ఈ సినిమా కి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి చేయనున్నారు. 

నటీనటులు: ఆది సాయి కుమార్, పాయల్ రాజ్ పుత్, సునీల్, అనూప్ సింగ్ ఠాకూర్, కబీర్ సింగ్ ఠాకూర్, పూర్ణ తదితరులు.

సాంకేతిక నిపుణులు: బ్యానర్: విజన్ సినిమాస్, డైరెక్టర్: కళ్యాణ్ జి గోగణ, ప్రొడ్యూసర్: నాగం తిరుపతి రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తిరుమల రెడ్డి, మ్యూజిక్: సాయి కార్తీక్, ఎడిటర్: మణికాంత్, సినిమాటోగ్రాఫర్: బాల్ రెడ్డి, పీఆర్.ఒ: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు.

Adi Sai Kumar Tees Mar Khan movie in the final stage:

<span>Aadi Saikumar, Payal Rajput Beachside Romantic Pictures From Vision Cinemas Tees Maar Khan Out</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs