Advertisement
Google Ads BL

విరాట్ రాజ్ హీరోగా సీతామనోహర శ్రీరాఘవ


వెండితెర కు మరో నట వారసుడు పరిచయం అవుతున్నారు. అతని పేరు విరాట్ రాజ్. అతను హీరోగా రూపొందుతున్న సీతామనోహర శ్రీరాఘవ చిత్రం నేడు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖులు,ఆత్మీయులు సమక్షంలో వైభవంగా ప్రారంభం అయింది. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచాన్ చేయగా, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి క్లాప్ నిచ్చారు. యువ హీరో ఆకాష్ పూరి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు సతీమణి శ్యామల గారు హీరో విరాట్ రాజ్ కు ఆశీస్సులు అందించి, యూనిట్ కు శుభాకాంక్షలు తెలియ చేసారు.

Advertisement
CJ Advs

ఇటు తాత వెంకట సుబ్బరాజు, అటు పెద తాత హరనాథ్ గారు స్ఫూర్తి తో ఈ సీతామనోహర శ్రీరాఘవ చిత్రం ద్వారా హీరోగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఇది సరైన చిత్రంగా భావిస్తున్నాను. మీడియా, చిత్ర పరిశ్రమలోని పెద్దలు, ప్రేక్షకులు ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను అన్నారు విరాట్ రాజ్. అలనాటి అందాల హీరో హరనాథ్ సోదరుడు వెంకట సుబ్బరాజు మనుమడు ఈ విరాట్ రాజ్. కొద్దిరోజుల క్రితం హీరో విరాట్ రాజ్ పుట్టినరోజు సందర్భంగా చిత్రం హీరోను, పేరును పరిచయం చేస్తూ రూపొందించిన ప్రచార చిత్రాలు,వీడియో ప్రశంసలు అందుకున్న విషయ విదితమే. 

ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్న దుర్గా శ్రీ వత్సస.కె. మాట్లాడుతూ...మాస్ ఎంటర్ టైనర్ ఈ చిత్రం అన్నారు. హీరోగా విరాట్ రాజ్ పరిచయం అవుతున్న ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా నేనూ పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఒక ఇమేజ్ కు మాత్రమే పరిమితం కాకుండా ఈ చిత్రం ద్వారా భిన్నమైన చిత్రాలకు సరితూగే ఇమేజ్ ను విరాట్ రాజ్ స్వంతం చేసుకునేలా ఈ చిత్రం కథను సిద్ధం చేయటం జరిగింది. చిత్రం పేరు సీతామనోహర శ్రీరాఘవ. పేరు వెనుక కథ ఏమిటన్నది ప్రస్తుతానికి గోప్యంగా ఉంచుతున్నాము. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగా, మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పలు భావోద్వేగాల సమ్మిళితం అన్నారు దర్శకుడు. కె.జి.ఎఫ్. 2, సలార్  చిత్రాలకు సంగీతం సమకూరుస్తున్న రవి బస్ రుర్ ఈ  చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన సంగీతం ఈ చిత్రాన్ని మరో మెట్టు ఎక్కిస్తుందని నమ్ముతున్నాను. అలాగే త్రిబుల్ ఆర్ చిత్రానికి పోరాటాలు సమకూర్చిన కింగ్ సాలమన్ ఈ చిత్రానికి కంపోజ్ చేస్తున్న పోరాటాలు చిత్రానికి మరో ఆకర్షణ. నిర్మాత సుధాకర్ గారు హీరో కుటుంబానికి సన్నిహిత మిత్రులు. ఆయన నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి విజయవంతమైన చిత్రంగా దీనిని మలచటానికి కృషి చేస్తానన్నారు.

వెండితెరకు మరో నట వారసుడు ను తమ 

వందన మూవీస్ చిత్ర నిర్మాణ సంస్థ ద్వారా పరిచయం చేయటం చాలా ఆనందంగా ఉంది అన్నారు చిత్ర నిర్మాత సుధాకర్.టి. నవంబర్ లో చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని,ఓ మంచి కథతో వందన మూవీస్ చిత్ర నిర్మాణ సంస్థ పరిచయం కావటం సంతోషంగా ఉందన్నారు.

సంగీత దర్శకుడు రవి బస్ రుర్ మాట్లాడుతూ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించటం ఆనందంగా ఉందన్నారు.  కధానాయిక రేవ మాట్లాడుతూ ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం కావటం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. చిత్ర ప్రారంభోత్సవానికి విచ్చేసి ఆశీస్సులు అందించిన ప్రముఖులు నిర్మాత లు ఎ.ఎం.రత్నం,సురేష్ బాబు,దర్శకుడు అనిల్ రావిపూడి, యువ హీరో ఆకాష్ పూరి,రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు సతీమణి శ్యామల గారు లకు చిత్ర బృందం కృతజ్ఞతలు తెలిపారు.

సీతామనోహర శ్రీరాఘవ చిత్రంలో కథానాయకుడిగా విరాట్ రాజ్, నాయికగా రేవ, ఇతర పాత్రల్లో తనికెళ్లభరణి, బ్రహ్మాజీ, పృథ్వీ, కబీర్ దుహాన్ సింగ్, ప్రవీణ్, గోపరాజు రమణ, రాఘవ,కృష్ణ, నిఖిలేంద్ర, సత్య సాయి శ్రీనివాస్, రూపాలక్ష్మి నటిస్తున్నారు. 

Virat Raj Seeta Manohara Sri Raghava Movie Launch:

Seeta Manohara Sri Raghava Movie Opening
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs