Advertisement
Google Ads BL

కార్తికేయ రాజా విక్ర‌మార్క‌ వచ్చేస్తున్నాడు


తెలుగు తెరపైకి నవంబర్ 12న కొత్త గూఢచారి రాబోతున్నాడు. యాక్షన్ ప్లస్ కామెడీతో నయా ఏజెంట్ విక్రమ్ పాత్రలో మన ఆడియ‌న్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి కార్తికేయ గుమ్మకొండ రెడీ అయ్యారు. ఆయన హీరోగా నటించిన స్పై యాక్షన్ ఎంటర్టైనర్ రాజా విక్రమార్క. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో 88 రామారెడ్డి నిర్మించారు. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. నవంబర్ 12న థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా నిర్మాత 88 రామారెడ్డి మాట్లాడుతూ హీరో కార్తికేయ లేకుండా రాజా విక్రమార్క సినిమాను ఊహించలేం. ఏజెంట్ విక్రమ్ పాత్రలో ఇరగదీశారు. యాక్టింగ్, యాక్షన్ సీన్స్ పరంగా ఆయనకు రాజా విక్రమార్క నెక్స్ట్ లెవల్ సినిమా అవుతుంది. దర్శకుడు శ్రీ సరిపల్లికి తొలి సినిమా అయినా బాగా తీశాడు. ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. మేమంతా సినిమా పట్ల చాలా హ్యాపీగా ఉన్నాం. త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేయాలని సన్నాహాలు చేస్తున్నాం. నవంబర్ 12 థియేటర్లలో విడుదల చేయాలనేది మా ప్లాన్. కమర్షియల్ హంగులతో పాటు కొత్తదనం కూడిన ఈ న్యూ ఏజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుంది అని అన్నారు.

దర్శకుడు శ్రీ సరిపల్లి మాట్లాడుతూ ఎన్ఐఏ ఏజెంట్‌ విక్రమ్ పాత్రలో కార్తికేయ కొత్తగా కనిపిస్తారు. ఆయన లుక్, క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటాయి. కార్తికేయ కెరీర్‌లో బెస్ట్ లుక్‌ అని చెప్పొచ్చు. స్క్రీన్‌ప్లే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. స్క్రిప్ట్‌కి అనుగుణంగా ఎక్కువ లొకేష‌న్స్‌లో షూటింగ్ చేశాం. ఒక్కోసారి ఒక్క షాట్ కోసం ప‌ర్టిక్యుల‌ర్ లొకేష‌న్‌కు వెళ్లి, పర్మిషన్ తీసుకుని షూటింగ్ చేసిన సంద‌ర్భాలు ఉన్నాయి. కార్తికేయతో పాటు తనికెళ్ల భరణిగారు, సాయికుమార్ గారు, పశుపతిగారు, తాన్యా రవిచంద్రన్, హర్షవర్ధన్, సుధాకర్ కోమాకుల పాత్రలకు కథలో ప్రాముఖ్యం ఉంటుంది. ఇంపార్టెంట్ రోల్స్ క్యారెక్టరైజేషన్‌తో పాటు వాళ్ళు ఉపయోగించే వెహికల్స్, గన్స్ దగ్గర్నుంచి ప్రతి అంశంలోనూ ఎంతో జాగ్రత్త తీసుకున్నాం అని అన్నారు.

Kartikeya Raja Vikramarka to release in Theatres:

Kartikeya Raja Vikramarka to release in Theatres on November 12th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs