Advertisement
Google Ads BL

రెండు చిరంజీవి వెబ్ సైట్స్‌ను ప్రారంభించిన రామ్‌చ‌ర‌ణ్‌


చిరంజీవి చారిట్ర‌బుల్ ట్ర‌స్ట్ వెబ్ సైట్‌ను ప్రారంభించిన మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌

Advertisement
CJ Advs

మెగాస్టార్ చిరంజీవి.. చిరంజీవి చారిట్ర‌బుల్ ట్ర‌స్ట్ అనే సంస్థ‌ను ఏర్పాటు చేసి అభిమానుల‌ను సేవా గుణం వైపు న‌డిపిస్తూ ర‌క్త దానం, నేత్ర‌దానం వంటి కార్య‌క్ర‌మాల్లో వారిని భాగ‌స్వామ్యులుగా చేశారు. ఎన్నో సేవా కార్య‌క్ర‌మాల్లో పాలు పంచుకుని అంద‌రిలో స్ఫూర్తిని నింపుతూ అభిమానులు ముందుకు న‌డిపించారు చిరంజీవి. ఇప్పుడు చిరంజీవి చారిట్ర‌బుల్ ట్ర‌స్ట్ సేవా కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు మ‌రింత ద‌గ్గ‌ర చేయ‌డానికి చిరంజీవిచారిటల్ ట్రస్ట్ డాట్ కం ప్రారంభించారు. అలాగే చిరంజీవిగారి న‌టించిన సినిమాల‌కు సంబంధించిన విశేషాలు, వివ‌రాల‌ను తెలియ‌జేయ‌డ‌మే కాకుండా ఆయ‌న చేసిన సేవా కార్య‌క్ర‌మాల‌ను గురించి తెలియ‌జేసేలా కేచిరంజీవి డాట్ కం అనే వెబ్ సైట్‌ను ప్రారంభించారు. ఈ రెండు వెబ్ సైట్స్‌ను చిరంజీవి త‌న‌యుడు, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ సోమ‌వారం రోజున‌ ప్రారంభించారు. 

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ మాట్లాడుతూ.. 1998 అక్టోబ‌ర్ 2న చిరంజీవి చారిట్రబుల్ ట్రస్ట్ మొద‌లైంది. ఈ ట్ర‌స్ట్ త‌న సేవా కార్య‌క్ర‌మాల‌ను 20 ఏళ్ల‌కు పైగా చేసుకుంటూ వ‌స్తుంది. అక్క‌డ నుంచి ట్ర‌స్ట్ చేసిన సేవా కార్య‌క్ర‌మాల గురించి అంద‌రికీ తెలిసిందే. బెస్ట్ బ్ల‌డ్ బ్యాంకుగా చాలా అవార్డ్స్ కూడా వ‌చ్చాయి. చాలా గ‌ర్వ‌కార‌ణంగా అనిపిస్తుంది. సేవా కార్యక్రమాలను వివిధ ప్రాంతాల్లో ప్రజలకు అందించాలనే ఆలోచ‌న‌తో చిరంజీవిచారిటల్ ట్రస్ట్ డాట్ కం వెబ్ సైట్‌తో ఆన్ లైన్ సేవ‌ల‌ను ప్రారంభించాం. ప్ర‌స్తుతం అంద‌రం పాండమిక్ ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నాం. కాబ‌ట్టి ప్ర‌జలు ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆక్సిజ‌న్ అవ‌స‌రం అయితే ఆ రిక్వెస్ట్‌ను మాకు పంపొచ్చు. అలాగే ర‌క్తం కూడా ఎవ‌రికైనా అత్య‌వ‌స‌రం అయిన‌ప్పుడు కూడా ఆన్‌లైన్‌లోనే రిక్వెస్ట్ పంపొచ్చు. అలా చేసిన‌ప్పుడు మా బ్యాక్ ఎండ్ టీమ్ వారిని వెంట‌నే సంప్ర‌దించి, వారికి స‌పోర్ట్ చేస్తారు. ఆన్‌లైన్‌లోనే రిక్వెస్ట్ ఫారంస్ అందుబాటులో ఉంటాయి. అలాగే ర‌క్తాన్ని దానం చేయాల‌నునుకున్న వారు వీలును బ‌ట్టి ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకుని రక్తాన్ని డొనేట్ చేయ‌వ‌చ్చు. అలాగే కంటికి సంబంధించిన కూడా డొనేష‌న్ చేయాల‌నుకున్న‌వారు రిక్వెస్ట్ పెడితే మేం వెంట‌నే స్పందిస్తాం. ఇండియాలోని 25 భాష‌ల్లో మా వెబ్ సైట్ ఉంటుంది. అలాగే బ‌డ్ల్ డొనేట్ చేయ‌డానికి వీలుగా ఉండేలా ఆపీసుల‌ను హైద‌రాబాదులోనే కాకుండా ఇత‌ర ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేస్తాం. 

ఒక‌ప్పుడు నాన్న‌గారిని అభిమానులు త‌రుచు క‌లుసుకునేట‌ప్పుడు వారికి ఒక్కొక్క‌రికి ఫొటోల‌ను ఇచ్చేవారు. అయితే వారిని కూడా ఈ సేవా కార్య‌క్ర‌మంలో భాగ‌స్వామ్యులు చేయాల‌నే ఆలోచ‌న రావ‌డంతో ర‌క్త‌దానం చేసిన వారికి ఫొటో ఇస్తాన‌ని చెప్ప‌డంతో అభిమానులు కూడా స‌పోర్ట్ చేశారు. చాలా మంది అభిమానులు 160..80..50 ఇలా లెక్క పెట్ట‌లేనంత‌గా స‌పోర్ట్ చేశారు. చిరంజీవిగారు, అర‌వింద్‌గారు క్ర‌మంగా విష‌యాల‌ను తెలుసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఈ ట్ర‌స్ట్‌ను ముందుకు తీసుకెళ్లారు. 

అలాగే నాన్న‌గారిపై చాలా వెబ్‌సైట్స్‌ను అభిమానులు స్టార్ట్ చేశారు. అయితే అధికారికంగా ఆయ‌న సినిమాల గురించిన వివ‌రాలు మా వెబ్ సైట్‌లో దొరుకుతుంది. న‌టుడిగా ఆయ‌న ప‌డ్డ ఇబ్బందులు, సాధించిన విజ‌యాలు, ఆయ‌న జ‌ర్నీ.. అలాగే టూరిజం మినిష్ట‌ర్‌గా ఉన్న‌ప్పుడు ఎలాంటి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు.. ఇలా అన్ని విష‌యాల‌ను కేచిరంజీవి డాట్ కం లో చూడొచ్చు అన్నారు.

Ramcharan launched two Chiranjeevi websites :

The Chiranjeevi Charitable Trust was established on October 2, 1998.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs