Advertisement
Google Ads BL

బుజ్జీ.. ఇలారా.. టీజర్ లాంచ్


బుజ్జీ.. ఇలారా.. సినిమాకు ప్రధాన కారణం జీ నాగేశ్వరరెడ్డి.. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ధన్ రాజ్

Advertisement
CJ Advs

సునీల్, ధన్‌రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ బుజ్జి ఇలా రా. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌ అనేది సినిమా ట్యాగ్‌లైన్‌. ట్యాగ్‌లైన్ ను బ‌ట్టే సినిమా సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ అని అర్థ‌మ‌వుతుంది. చాందిని అయ్యంగార్‌ హీరోయిన్‌గా న‌టిస్తుంది. రూపా జ‌గ‌దీశ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్ఎన్ఎస్ క్రియేష‌న్స్ ఎల్ఎల్‌పి, జీ నాగేశ్వ‌ర‌రెడ్డి టీమ్ వ‌ర్క్ ప‌తాకాల‌పై అగ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవ‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్, అలాగే ఇటీవల విడుదలైన సీఐ కేశ‌వ్ నాయుడు పాత్ర‌లో న‌టిస్తున్న ధ‌న్‌రాజ్ పాత్రకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు.

నిర్మాతలు మాట్లాడుతూ.. ఈ సినిమాకు కర్త కర్మ క్రియ అన్నీ కూడా మా అన్న జీ నాగేశ్వరరెడ్డి గారు. సినిమాకు సంబంధించిన ప్రతీ నిర్ణయం ఆయనదే. ఆయన ఉన్నారనే నమ్మకంతో మేం ధైర్యంగా అడుగు ముందుకు వేశాం. డైరెక్టర్ అంజీ గారు అద్భుతంగా సినిమాను తీశారు. మొదటి నుంచి ఆయన్ను ఫాలో అవుతున్నాను. సినిమా విడుదలయ్యాక ఆయన గురించి ఇంకా చెబుతాను అని అన్నారు.

ధన్ రాజ్ మాట్లాడుతూ.. బుజ్జి ఇలా రా అనే సినిమా వచ్చిందంటే దానికి కారణం జీ నాగేశ్వర్ రెడ్డి గారు. ఆయన నన్ను నమ్మి ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ సినిమాకు ఆయన కో డైరెక్టర్ కంటే ఎక్కువ పని చేశారు. మా కంటే ముందే సెట్‌కు వచ్చే వారు. అన్నింటిని దగ్గరుండి చూసుకునే వారు. అందరి కంటే లేటుగా వెళ్లేవారు. నా సినిమాకు ఇలా పెద్ద డైరెక్టర్ పని చేయడం గర్వంగా ఉంది. దర్శకుడు అంజి సెట్ మీద ఉంటే ఎప్పుడూ కూడా పని గురించే ఆలోచిస్తుండే వారు. 45 రోజుల్లో అద్భుతంగా ఈ చిత్రాన్ని తీశారు. ఈ సినిమా తీయడం కోసమే నేను తాడేపల్లిగూడెం నుంచి వచ్చాను అని గర్వంగా చెప్పుకొంటాను. కొత్త ధన్ రాజ్‌ను చూస్తారు అని అన్నారు.

జీ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ధన్ రాజ్ నేను  కలిసి చాలా చిత్రాలు చేశాం. కరోనా సమయంలో ఓసారి అంతా కలిశాం. అలా కలిసినప్పుడు ధన్ రాజ్‌ను వారం రోజులు ఫాలో అయ్యాను. ధన్ రాజ్ ఓ కమెడియన్. కానీ నాకు అలా నచ్చలేదు. ఆయనలో ఓ సైకో ఉన్నాడు. అందుకే అతనికి ఓ కథ పంపించాను. అదే బుజ్జి ఇలా రా. ఈ చిత్రం కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేశాడు. ఎన్నో సినిమాలు పోగొట్టుకున్నాడు. డబ్బును కూడా కాదనుకున్నాడు. అడ్వాన్స్‌లు పట్టుకుని ఇంటికి వస్తే కూడా కాదనుకున్నాడు. ధన్ రాజ్ కష్టానికి ప్రేక్షకులు మంచి విజయాన్ని అందిస్తారు. ఈ సినిమా తరువాత ధన్ రాజ్‌కు మంచి పొజిషన్ వస్తుంది. ప్రతీ ఒక్క పాత్ర అద్భుతంగా ఉంటుంది. అందరూ బాగా నటించారు. సినిమాను చూడండి కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అని అన్నారు. సాయికార్తీక్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి భాను, నందు డైలాగ్స్ అందిస్తున్నారు.

న‌టీన‌టులు: సునీల్‌, ధ‌న‌రాజ్‌, చాందిని త‌మిళ‌ర‌స‌న్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, శ్రీకాంత్ అయ్య‌ర్‌, స‌త్య‌కృష్ణ‌, వేణు, భూపాల్‌, టెంప‌ర్ వంశీ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు: క‌థ‌, స్క్రీన్ ప్లే: జి.నాగేశ్వ‌ర రెడ్డి, సినిమాటోగ్ర‌పీ, ద‌ర్శ‌క‌త్వం: గ‌రుడ‌వేగ అంజి, నిర్మాత‌లు: అగ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవ రెడ్డి, స‌మ‌ర్ప‌ణ‌: రూపా జ‌గ‌దీశ్‌, బ్యాన‌ర్స్‌: జి.నాగేశ్వ‌ర రెడ్డి టీమ్ వ‌ర్క్‌, ఎస్ఎన్ఎస్ క్రియేష‌న్స్ ఎల్ఎల్‌పి, మ్యూజిక్‌: సాయికార్తీక్‌, డైలాగ్స్‌: భాను, చందు, ఆర్ట్‌: చిన్నా, ఎడిట‌ర్‌: చోటా కె. ప్ర‌సాద్‌, ఫైట్స్: రియ‌ల్ స‌తీశ్‌, కాస్ట్యూమ్స్‌: మ‌నోజ్‌, మేక‌ప్‌: వాసు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: సీతారామరాజు, పి.ఆర్‌.ఓ: వంశీ శేఖ‌ర్‌.

Bujji.. Ilara.. Teaser Launch:

Bujji.. Ilara.. Director Anji made a wonderful film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs