Advertisement
Google Ads BL

అర్థం ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ విడుదల


అజయ్, శ్రద్ధా దాస్, మహేంద్ర, ఆమని నటించిన అర్థం ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేసిన ప్రముఖ దర్శకులు దేవ్ కట్టా

Advertisement
CJ Advs

దేవి, పెదరాయుడు చిత్రాలతో బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మహేంద్ర, శ్రద్ధా దాస్.. అజయ్, ఆమని, సాహితీ అవంచ ప్రధాన తారలుగా రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ అర్థం. రిత్విక్ వెత్సా సమర్పణలో మినర్వా పిక్చర్స్, ఎస్‌విఎమ్ (శ్రీ వాసవి మూవీ) ప్రొడక్షన్స్ పతాకాలపై రాధికా శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సినిమా తెరకెక్కింది. ఇంతకు ముందు అనేక చిత్రాలకు ఎడిటర్‌గా, వీఎఫ్ఎక్స్ నిపుణుడిగా పని చేసి గుర్తింపు తెచ్చుకున్న మణికాంత్ తెల్లగూటి రచయిత, దర్శకుడు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు దేవ్ కట్టా, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. సినిమా విజయవంతకం కావాలని ఆకాంక్షించారు. మోషన్ పోస్టర్ లో విజువల్ ఎఫెక్ట్స్ హై స్టాండర్డ్స్ లో ఉన్నాయని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మోషన్ పోస్టర్ చివరలో గన్ పట్టుకుని కనిపించిన మహేంద్ర సినిమాపై క్యూరియాసిటి పెంచారు. శ్రద్ధా దాస్ కూడా కనిపించారు.

ఈ సందర్భంగా నిర్మాత రాధికా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేసిన దేవ్ కట్టా గారికి కృతజ్ఞతలు. ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే కథాంశంతో రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదల వివరాలు వెల్లడిస్తాం. మణికాంత్ తెల్లగూటి అద్భుతంగా తెరకెక్కించారు. తెలుగులో ఖైదీకి అద్భుతమైన మాటలు, పలు చిత్రాల్లో పాటలు రాసిన రాకేందు మౌళి మా సినిమాకి మాటలు, పాటలు రాశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ చక్కటి బాణీలు అందించారు. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తా అని అన్నారు.

దర్శకుడు మణికాంత్ తెల్లగూటి మాట్లాడుతూ.. కుటుంబ విలువలను కాపాడే, మహిళా సాధికారతను పెంపొందించే సరికొత్త కథాంశంతో రూపొందుతున్న సినిమా అర్థం. సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాకి వినోదం మేళవించి ఆసక్తికరంగా తీర్చిదిద్దుతున్నాం. వీఎఫ్ఎక్స్‌లో నాకు అనుభవం ఉండటంతో సినిమా వీఎఫ్ఎక్స్‌ విషయంలో మరింత శ్రద్ధ వహిస్తున్నాను. అత్యుత్తమ నిర్మాణ విలువలతో రాధికా శ్రీనివాస్ గారు సినిమా నిర్మించారు అని అన్నారు.

మహేంద్ర, శ్రద్దా దాస్, వైశాలి నందన్, అజయ్, ఆమని, సాహితీ అవంచ, దేవి ప్రసాద్, సాయి దీనా, వాసు విక్రమ్, రౌడీ రోహిణి, ఈటీవీ ప్రభాకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి, మాటలు-పాటలు: రాకేందు మౌళి, నృత్యాలు: సుచిత్రా చంద్రబోస్, ఛాయాగ్రహణం: పవన్ చెన్నా, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ అసోసియేట్ నిర్మాత: పవన్ జానీ, వెంకట రమేష్, నిర్మాత: రాధికా శ్రీనివాస్, కూర్పు-రచన-దర్శకత్వం: మణికాంత్ తెల్లగూటి.

Arrdham First Look and Motion Poster:

First Look Motion Poster of Arrdham unveiled
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs