Advertisement
Google Ads BL

మధురపూడి గ్రామం అనే నేను ఫస్ట్ లుక్


మధురపూడి గ్రామం అనే నేను ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన దర్శకుడు హరీష్ శంకర్

Advertisement
CJ Advs

శివ కంఠమనేని హీరోగా నటిస్తున్న కొత్త సినిమా మధురపూడి గ్రామం అనే నేను. జి రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు నిర్మాతలు. కళ్యాణ్ రామ్ కత్తి దర్శకుడు మల్లి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. విజయదశమి పండగ శుభాకాంక్షలతో మధురపూడి గ్రామం అనే నేను సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ దర్శకుడు హరీష్ శంకర్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉందన్న హరీష్ శంకర్ హీరో శివ కంఠమనేని, చిత్ర బృందానికి బెస్ట్ విశెస్ తెలిపారు.

ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ చూస్తే.. కథానాయకుడు విలన్ తల నరికి చేతిలో పట్టుకుని మరో చేత్తో ఒక మహిళను ఎత్తుకున్నారు. ఆమెను కాపాడేందుకే హీరో హత్య చేశాడా, మధురపూడి గ్రామం అనే నేను కథేంటి తెరపై చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి.

ఈ చిత్రానికి సహ నిర్మాతలు - కె శ్రీధర్ రెడ్డి, ఎం జగ్గరాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ - కె శ్రీనివాసరావు, వై అనిల్ కుమార్, సంగీతం - మణిశర్మ, సినిమాటోగ్రఫీ - సురేష్ భార్గవ్, ఎడిటర్ - గౌతమ్ రాజు, ఫైట్స్ - రామకృష్ణ, మాటలు - ఉదయ్ కిరణ్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ నరేన్ జి సూర్య, కో డైరెక్టర్: ఆర్. ఎస్. సురేష్, పీఆర్వో - జీఎస్ కే మీడియా, సమర్పణ - జి రాంబాబు యాదవ్, బ్యానర్ - లైట్ హౌస్ సినీ మ్యాజిక్, నిర్మాతలు - కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు, రచన - దర్శకత్వం - మల్లి.

Madhurapudi Gramam ane nenu First Look:

Madhurapudi Gramam ane nenu Motion poster Release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs