Advertisement
Google Ads BL

గోవాలో గోపాల కృష్ణుడు, బ్యాంకాక్ లో బాలకృష్ణుడు ఒకేసారి..


కలిమి క్రియేషన్స్ బ్యానర్ లో గోవాలో గోపాల కృష్ణుడు, బ్యాంకాక్ లో బాలకృష్ణుడు ఒకేసారి రెండు చిత్రాలు ప్రారంభం.

Advertisement
CJ Advs

కలిమి క్రియేషన్స్ పతాకంపై మోహన్ కృష్ణ, దేవి, సౌజన్య, దాసరి శిరీష, సీతల్ బట్ నటీనటులుగా లోకేష్ గౌడ్ దర్శకత్వంలో సుధాకర్, సంగీత, పవన్ కుమార్ లు సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న చిత్రం గోవాలో గోపాల కృష్ణుడు .ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని రాక్ క్యాసిల్ లో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన స్పీకర్ వేణుగోపాలచారి హీరో, హీరోయిన్లపై తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, నిర్మాత రామ సత్యనారాయణ కెమెరా స్విచ్చాన్ చేశారు, దర్శకుడు వీరశంకర్ గౌరవ దర్శకత్వం గౌరవ దర్శకత్వం వహించారు అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో 

హీరో మోహన్ కృష్ణ మాట్లాడుతూ.. ఇది పూర్తి గోవా బ్యాక్ డ్రాప్ లో జరుగుతున్న స్టోరీ ఈ చిత్రం ద్వారా నా మిత్రుడు లోకేష్ గౌడ్ దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. తను ఈ కథను బాగా డెవలప్ చేసి తయారు చేసుకున్నాడు. ఈ సినిమాలో మూడు సాంగులు, మూడు ఫైట్స్ ఉంటాయి. ఈ మూవీ గోవా నేపథ్యంలో అమ్మాయిలతో తిరిగే  గోపాల కృష్ణుడు క్యారెక్టర్ లో నటిస్తున్నాను.వారి చుట్టూ తిరుగుతున్న కథ ఇది లేడీస్ అందరికీ న్యాయం జరుగుతుంది. ఈ సినిమాలో అందరి కి కావాల్సిన రొమాంటిక్ సీన్స్, కామెడీ అన్ని ఉంటాయి నలుగురు హీరోయిన్లతో చేస్తున్న ఈ సినిమా ఫుల్ రొమాంటిక్ కామెడీ జోనర్లో ఉపేంద్ర సినిమాల స్టైల్లో ఈ సినిమా ఉంటుంది. ఇదే ప్రొడక్షన్ లో మరో సినిమా బ్యాంకాక్ లో బాలకృష్ణుడు మూవీ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాకు శ్రీ లక్ష్మణ్ ను పరిచయం చేస్తున్నాం. ఒక నెలలో ఈ రెండు సినిమాలు మొదలై ఆ తరువాత  ఒక వారం తేడాలోనే రెండు సినిమాలు విడుదల చేస్తామని అన్నారు 

దర్శకుడు లోకేష్ గౌడ్ మాట్లాడుతూ.. కలిమి క్రియేషన్స్ లో గోవాలో గోపాలకృష్ణుడు ద్వారా దర్శకుడు గా పరిచయమవు తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.ఈ సినిమా ఫుల్ లవ్ ఎంటర్టైన్మెంట్ తో సాగుతుంది. హీరో, హీరో హీరోయిన్లు అందరూ కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చారు మా  సినిమాను ఆశీర్వదించదానికి వచ్చిన  పెద్దలకు నా ధన్యవాదాలు. ఇంతమంచి సినిమాలో నాకీ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు ఆన్నారు. 

నిర్మాత సుధాకర్ మాట్లాడుతూ.. మొదటగా మా సినిమాను ఆశీర్వదించదానికి వచ్చిన సినీ పెద్దలకు ధన్యవాదాలు. మేము మొదట సీనియర్ హీరోతో సినిమా చేద్దామనుకున్నా పక్షంలో మా ఫ్రెండ్ ద్వారా మోహన కృష్ణ గారు పరిచయమయ్యారు తన చేసిన సినిమాలు చూశాము ఆ సినిమాలు నచ్చి ఈ సినిమా మొదలు పెట్టాము .ఈ నెలలోనే  గోవాలో కి షూటింగ్ కు వెళ్తున్నాం, అలాగే బ్యాంకాక్ లో బాలకృష్ణుడు మా బ్యానర్ లో చేస్తున్న రెండవ  సినిమా. ఈ రెండు సినిమాలు కూడా సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తాం అన్నారు. 

మరో నిర్మాత పవన్ కుమార్ మాట్లాడుతూ.. గోవాలో గోపాల కృష్ణుడు టైటిల్ చాలా అద్భుతంగా ఉంది. మూడు గంటలసేపు చూసిన ప్రతి ప్రేక్షకుడు కచ్చితంగా ఎంజాయ్ చేస్తాడు. ఈరోజు జరిగిన క్లాప్ నుంచి ఎండింగ్ వరకు షూటింగ్ షెడ్యూల్ జరుగుతూనే ఉంటుంది.దసరా సందర్భంగా శుభాకాంక్షలతో సుధాకర్, మేడం సంగీత గార్ల తో కలసి ఈ సినిమా తీస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అన్నారు. 

నిర్మాత సంగీత మాట్లాడుతూ.. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు. 

చిత్ర హీరోయిన్స్ మాట్లాడుతూ.. మంచి కాన్సెప్ట్ ఉన్న  ఇంత మంచి చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

నటీనటులు: మోహన్ కృష్ణ, దేవి,సౌజన్య, దాసరి శిరీష, సీతల్ బట్ తదితరులు.

సాంకేతిక నిపుణులు, బ్యానర్: కలిమి క్రియేషన్స్, సినిమా: గోవాలో గోపాలకృష్ణుడు ప్రొడ్యూసర్స్: సుధాకర్, సంగీత, పవన్ కుమార్, స్రీన్ ప్లే డైరెక్షన్: లోకేష్ గౌడ్, స్టోరి రైటర్: సింగలూరు మోహన్ రావు, కెమెరామెన్: మురళి, మ్యూజిక్: ఘనశ్యాం, డాన్స్: మహేష్ ఫైట్స్: రామ్ సుంకర, పిఆర్వో: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు.

CLICK HERE: Goa Lo Gopala krishnudu Movie Opening

CLICK HERE: Bangkok lo balakrishnudu movies Opening

Goa Lo Gopala krishnudu Movie Opening:

Goa Lo Gopala krishnudu&nbsp;<span>Bangkok</span>&nbsp;lo balakrishnudu movies Opening
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs