Advertisement
Google Ads BL

ఆది సాయి కుమార్ తీస్ మార్ ఖాన్


లవర్ బాయ్ ఇమేజ్ ను సంపాదించుకున్న ఆది సాయికుమార్... పలు యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా  నటించి  మాస్ ఆడియెన్స్ కు కూడా చేరువయ్యాడు. అతని నుండీ రాబోతున్న తాజా చిత్రం తీస్ మార్ ఖాన్. నాటకం వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రొడక్షన్ నెంబర్ 3 గా విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి  ఈ సినిమా ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 

Advertisement
CJ Advs

ఆకర్షించే అందం, చక్కటి అభినయం తో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసిన పాయల్ రాజ్ పుత్ ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుండగా ఓ కీలకమైన పాత్రలో ప్రముఖ నటుడు సునీల్ నటిస్తున్నాడు.  దసరా పండగ సందర్భంగా ఈ సినిమా కి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ తీస్ మార్ ఖాన్ చిత్రంలో ఆది మరో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుండగా హై ఓల్టేజ్ యాక్షన్ ఓల్టేజ్ ఎంటర్టైనర్ గా భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది.

ఈ ఫస్ట్ లుక్ లో ఆది నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో కనిపిస్తున్నాడు. సిగరెట్ కాలుస్తూ నడుస్తూ వస్తున్నట్లు ఉన్న ఈ మాస్ లుక్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. ఇక ఈ సినిమా లో స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్ర లో ఆది నటిస్తుండటం విశేషం. పలు హిట్ చిత్రాలకు సంగీతం అందించిన సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మణికాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

Aadi Sai Kumar new movie title Tees Maar Khan:

Aadi Sai Kumar Tees Maar Khan first look 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs