Advertisement
Google Ads BL

జీ 5లో రాజ రాజ చోరకు హిట్ టాక్


జీ 5లో రాజ రాజ చోర విడుదలైన వెంటనే సామాజిక మాధ్యమాల్లో హీరో శ్రీవిష్ణు, హీరోయిన్లు సునైనా, మేఘా ఆకాష్ నటనను ప్రశంసిస్తూ... అనేకమంది నెటిజన్లు పోస్టులు పెట్టారు. థియేట్రికల్ రిలీజ్ తర్వాత అపూర్వమైన మార్కెటింగ్ క్యాంపెయిన్ చూసిన సినిమా ఇదేనని చెప్పాలి. ఈ సందర్భంగా పబ్లిసిటీ మారథాన్‌లో పాల్గొన్న శ్రీ విష్ణు, దర్శకుడు హసిత్ గోలీకి జీ 5 కృతజ్ఞతలు చెప్పింది.

Advertisement
CJ Advs

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన చాలామంది ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా రాజ రాజ చోర చూడమని ప్రజలకు చెప్పారు. కుటుంబ సభ్యులతో ఈ సినిమా చూడమని దర్శకుడు శ్రీవాస్ తన కోరితే... సీనియర్ రచయిత గోపి మోహన్ ఈ సినిమా ఒక జెమ్ అని అభివర్ణించారు. రచయిత - దర్శకుడు ప్రసన్న కుమార్ బెజవాడ సైతం సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఓ బేబీ దర్శకురాలు నందిని రెడ్డి సినిమా గురించి సోషల్ మీడియాలో మీరు వెండితెరపై అద్భుతమైన ఈ సినిమాను చూడడం మిస్ అయితే... ఇప్పుడు డిజిటల్  తెరపై చూసే అవకాశం మీకు దగ్గరకు వచ్చింది అన్నారు. రాజ రాజ చో బ్లాక్ బస్టర్ సినిమా అని రచయిత - దర్శకుడు బివిఎస్ రవి పేర్కొన్నారు.

టీవీ, ప్రింట్ ప్రమోషన్‌ల నుండి డిజిటల్ మీడియా వరకు... ఇన్‌ఫ్లుయెన్సర్‌ల నుండి మీమ్ పేజీల వరకూ... సినిమాలో ఫన్నీ మూమెంట్స్ షేర్ చేయడం చూస్తుంటే రాజ రాజ చోర ప్రజలు మెచ్చిన ఎంటర్టైనర్ అని స్పష్టమవుతుంది. జీ 5లో తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు అద్భుత స్పందన అందుకున్న ఈ సినిమాను దసరా వీకెండ్ లో మరింత మంది చూసే అవకాశం ఉంది.

అక్టోబర్ 22న జీ 5లో హెడ్స్ & టేల్స్ విడుదల కానుంది. దీంతో మరింత ఎంటర్టైన్మెంట్ వీక్షకులకు అందించడానికి సిద్ధమవుతోంది. విమర్శకుల ప్రశంసలు పొందిన కలర్ ఫోటో సినిమా టీమ్ నుండి వస్తున్న సినిమా ఇది. ముగ్గురు మహిళలు, భగవంతుడు చుట్టూ తిరిగే అందమైన కథతో హెడ్స్ అండ్ టేల్స్ రూపొందింది. ఇందులో భగవంతుడిగా సునీల్ నటించగా... 140కి పైగా చిత్రాలకు సంగీతం అందించిన మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించారు. ప్రస్తుతం తెలుగు ప్రజలు కంటెంట్ బేస్డ్ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు.

Dasara release Raja Raja Chora becomes a hit on ZEE5:

Raja Raja Chora becomes a hit on ZEE5
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs