అమెజాన్ ప్రైమ్ లో విశేషాధారణ దక్కించుకుంటున్న ముగ్గురు మొనగాళ్ళు
శ్రీనివాస్‌రెడ్డి, దీక్షిత్ శెట్టి (కన్నడ హిట్ మూవీ దియా ఫేమ్), వెన్నెల రామారావు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ముగ్గురు మొనగాళ్లు. ఫస్ట్ లుక్, ట్రైలర్ లతోనే మంచి బజ్ ను క్రియేట్ చేసిన ఈ చిత్రం ఇటీవల అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో విడుదల అయ్యి ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంది. అంగవైకల్యం కలిగిన ముగ్గురు యువకులు ఓ మర్డర్ కేసులో ఇరుక్కుని ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు.. ఆ కేసు నుండీ ఎలా బయటపడ్డారు? అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. శ్రీనివాసరెడ్డికి వినపడదు, దీక్షిత్ శెట్టి మాట్లాడలేడు, వెన్నెల రామారావుకు కనపడదు. ఈ ముగ్గురు నటులు కూడా తమ తమ పాత్రలకు జీవం పోశారనే చెప్పాలి. వీరి నటనతో ఆధ్యంతం ప్రేక్షకులను కడుపు చక్కలయ్యేలా నవ్వించారు.
ఈ చిత్రంలో ఎన్నో థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉన్నాయి. గరుడ వేగ ఫేమ్ అంజి అందించిన విజువల్స్, సురేష్ బొబ్బిలి సంగీతం, చిన్న నేపేథ్య సంగీతం వంటివి ఈ చిత్రానికి అదనపు ఆకర్షణలుగా నిలిచాయని చెప్పొచ్చు. ఈ చిత్రానికి అమెజాన్ ప్రైమ్లో మంచి ఆదరణ దక్కుతుంది. అలాగే మంచి వ్యూయర్ షిప్ కూడా నమోదవుతుండడం హర్షించదగ్గ విషయం. ఆల్రెడీ ముగ్గురు మొనగాళ్ళు అమెజాన్ ప్రైమ్లో ఉన్న అన్ని సినిమాల కంటే కూడా ట్రెండింగ్లో దూసుకుపోతుండడం మరో విశేషం. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని చిత్రమందిర్ స్టూడియోస్ బ్యానర్ పై అచ్యుత్ రామారావు నిర్మించారు.
నటీనటులు: శ్రీనివాసరెడ్డి, దీక్షిత్ శెట్టి (దియా మూవీ హీరో), వెన్నెల రామారావు, రిత్విష్‌శర్మ, శ్వేతా వర్మ, నిజర్, రాజా రవీంద్ర, జెమిని సురేష్, జోష్ రవి, భద్రం, సూర్య, జబర్తస్త్ సన్నీ.
సాంకేతిక నిపుణులు: డైరెక్టర్: అభిలాష్ రెడ్డి, రచయిత: కళ్యాణ్, ప్రొడ్యూసర్: పి. అచ్యుత్ రామారావు, కో ప్రొడ్యూసర్స్: తేజ చీపురుపల్లి,రవీందర్‌రెడ్డి అద్దుల, డీఓపీ: గరుడవేగ అంజి, మ్యూజిక్ డైరెక్టర్: సురేష్ బొబ్బిలి, బ్యాగ్రౌండ్ స్కోర్: చిన్నా, ఎడిటర్: బి. నాగేశ్వర రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్: నాని.