Advertisement
Google Ads BL

ఫస్ట్ లుక్ తగ్గేదే లే


భద్ర ప్రొడక్షన్ పతాకంపై  ప్రేమ్ కుమార్ పాండే, పీవీ సుబ్బారెడ్డి సంయుక్తంగా నిర్మించిన తగ్గేదే లే ఫస్ట్ లుక్ విడుదల చేసిన ఎంఈఐఎల్ పీపీరెడ్డి.

Advertisement
CJ Advs

టాలీవుడ్‌లో కొత్త బ్యానర్ ప్రారంభమైంది. నిర్మాతలు ప్రేమ్ కుమార్ పాండే, పీవీ సుబ్బారెడ్డి సంయుక్తంగా కలిసి ప్రారంభించిన భద్ర ప్రొడక్షన్‌ను ఈ రోజు ఎంఈఐఎల్ పీపీరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. భద్ర ప్రొడక్షన్స్ పతాకంపై మొదటి చిత్రంగా తగ్గేదేలే.. అనే ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, దివ్య పిళ్లై, అనన్య సేన్ గుప్తా, రవి శంకర్, రాజా రవీందర్, నాగ బాబు, అయ్యప్ప శర్మ, పృథ్వీ తదితరులు నటించారు. భద్ర ప్రొడక్షన్ కంపెనీ లోగోను ఎంఈఐఎల్ పీపీరెడ్డి ఆవిష్కరించగా.. నిర్మాతలు ప్రేమ్ కుమార్ పాండే, పీవీ సుబ్బారెడ్డి తగ్గేదేలే ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

నిర్మాత ప్రేమ్ కుమార్ పాండే మాట్లాడుతూ.. మంచి కథలను చెప్పేందుకు ఈ ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించాం. మన చరిత్రలో ఎన్నెన్నో కథలున్నాయి. ఒక్కో  ప్రాంతంలో ఒక్కో కల్చర్ ఉంటుంది. మన చిన్నప్పటి నుంచి ఎన్నో కథలు విని ఉంటాం. అలాంటి కథలను చెప్పేందుకు ఈ ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించాం. మా మామగారి స్ఫూర్తితోనే ఈ బ్యానర్ ప్రారంభమైంది. మా మామగారి తల్లి పేరు భద్రమ్మ. ఆమె పేరు మీదుగానే భద్ర ప్రొడక్షన్‌ను స్థాపించాం. 120 కోట్లకు పైగా ఉన్న జనాబాలో ఎంతో టాలెంట్ ఉంటుంది. అలాంటి వారికి ఈ ఫ్లాట్ ఫాం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. కొత్త కథలను చెప్పేందుకు మేం సిద్దంగా ఉన్నాం. మా మొదటి చిత్రం కాన్సెప్ట్ బేస్డ్‌గా రాబోతోంది. శ్రీనివాస రాజు, ఆయన టీం వల్లే ఈ చిత్రం ప్రారంభమైంది అని అన్నారు.

అనంతరం నిర్మాత సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. భద్ర ప్రొడక్షన్ బ్యాన‌ర్ ప్రారంభోత్స‌వానికి వ‌చ్చిన అతిథుల‌కు మ‌రియు మీడియా వారికి ధ‌న్య‌వాదాలు. స‌రికొత్త కాన్సెప్టుల‌తో సినిమాలు తీయ‌డానికే ఈ బ్యాన‌ర్‌ను స్థాపించాం. అందులో మొద‌టి ప్ర‌య‌త్నంగా  తగ్గేదే లే సినిమాతో మీ ముందుకు వ‌స్తున్నాం. మీ అంద‌రి బ్లెసింగ్స్ ఉండాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

రాజా రవీంద్ర మాట్లాడుతూ.. భద్ర ప్రొడక్షన్ అనేది తెలుగు ఇండస్ట్రీకి పెద్ద బ్యానర్. ఈ బ్యానర్‌కు సంబంధించిన అన్ని విషయాలను నన్ను చూసుకోమ్మని చెప్పిన నిర్మాతలు పీపీ రెడ్డి, సుబ్బారెడ్డి, ప్రేమ్ కుమార్ గారికి థ్యాంక్స్. దండుపాళ్యం సినిమాను తీసిన శ్రీనివాస రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ఆ గ్యాంగ్‌తో పాటు లవ్ స్టోరీ కూడా ఉంటుంది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. చాలా బాగా వచ్చింది. ఇండియాలో నెంబర్ వన్ ప్రొడక్షన్ కంపెనీగా చేసే అంత సత్తా ఉన్న నిర్మాతలు. మంచి కంటెంట్, ఎంటర్టైన్మెంట్ జానర్‌లో మొదటి ప్రయత్నంగా తగ్గేదేలే అనే చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్రంతో ప్రొడక్షన్ కంపెనీ ఎక్కడా కూడా తగ్గేదేలే అని అన్నారు.

దర్శకుడు శ్రీనివాస రాజు మాట్లాడుతూ.. భద్ర ప్రొడక్షన్‌ను లాంచ్ చేసిన నిర్మాతలకు థ్యాంక్స్. ఇంత పెద్ద బ్యానర్‌లో నన్ను దర్శకుడిగా తీసుకున్నందుకు థ్యాంక్స్. వారు తలుచుకుంటే ఎంతో పెద్ద చిత్రాలను తీయగలరు. కానీ కాన్సెప్ట్ బేస్డ్ సినిమా చేయాలని అనుకున్నారు. చిన్న చిత్రం అయినా కూడా ఏది అడిగితే అది ఇచ్చారు. సినిమా అయిపోయింది. టైటిల్ కోసం చాలా ఆలోచించాం. ఈ టైటిల్ చెప్పింది నిర్మాత గారే.. ఇలాంటి టైటిల్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ మాట్లాడుతూ.. పీపీ రెడ్డి గారి కథను తెలుసుకుని పాట పాడటం రాయడం నాకు ఆనందంగా ఉంది. చరణ్ అర్జున్‌గా పరిచయం అవ్వడం ఇదే మొదటిసారి. ఇంత పెద్ద బ్యానర్‌లో పని చేయడం ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి నన్ను ఎంచుకున్నందుకు రాజా రవీంద్రకు థ్యాంక్స్. మా డైరెక్టర్ చాలా కూల్‌గా ఉంటారు. నాతో లైవ్‌గా కంపోజ్ చేయించారు. ఇంకా మంచి చిత్రాలు మీతో చేయాలిన ఉంది. గత రెండేళ్లుగా నేను ప్రైవేట్ ఆల్బమ్స్‌ చేస్తూ వచ్చాను. ఇంత పెద్ద బ్యానర్‌లో ఇలా పరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.

ఈ కార్యక్రమంలో గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ పాల్గొని ప్రసంగించారు.

నటీనటులు: నవీన్ చంద్ర, దివ్య పిళ్లై, అనన్య సేన్ గుప్తా, రవి శంకర్, రాజా రవీందర్, నాగ బాబు, అయ్యప్ప శర్మ, పృథ్వీ తదితరులు

సాంకేతిక బృందం: రచన, దర్శకత్వం: శ్రీనివాస్ రాజు, నిర్మాతలు: ప్రేమ్ కుమార్ పాండే, పీవీ సుబ్బారెడ్డి, బ్యానర్స్: భద్ర ప్రొడక్షన్స్, సంగీతం: చరణ్ అర్జున్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాజా రవీందర్, నిమాటోగ్రఫర్: వెంకట్ ప్రసాద్, ఎడిటర్: గ్యారీ బీహెచ్, లిరిక్స్: భాస్కర భట్ల, రామ జోగయ్య శాస్త్రి, ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె, ఫైట్ మాస్టర్: వెంకట్, పీఆర్వో: వంశీ-శేఖర్.

Thaggede lee movie First look release:

Thaggede lee movie First look release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs