Advertisement
Google Ads BL

స్కైలాబ్‌.. త్వరలోనే థియేటర్స్‌లో


పోస్ట్ ప్రొడక్షన్ దశలో స‌త్య‌దేవ్‌, నిత్యామీనన్, రాహుల్ రామ‌కృష్ణ స్కైలాబ్‌.. త్వరలోనే థియేటర్స్‌లో సందడి

Advertisement
CJ Advs

స‌త్య‌దేవ్‌, నిత్యామీనన్, రాహుల్ రామ‌కృష్ణ ప్ర‌ధాన తారాగ‌ణంగా డా.రవి కిరణ్‌ సమర్పణలో బైట్‌ ఫ్యూచర్స్‌, నిత్యామీనన్‌ కంపెనీ పతాకాలపై విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో పృథ్వీ పిన్నమరాజు నిర్మిస్తోన్న చిత్రం స్కైలాబ్‌. 1979 లో సాగే పీరియాడిక్ మూవీ ఇది. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు తుది ద‌శ‌కు చేరుకున్నాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమాను థియేట‌ర్స్‌లో విడుద‌ల చేయ‌డానికి మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. అక్టోబ‌ర్ నెల‌లోనే థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను కూడా విడుద‌ల చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా.. చిత్ర ద‌ర్శ‌కుడు విశ్వక్ ఖండేరావు మాట్లాడుతూ.. వైవిధ్యమైన చిత్రాలను ఆద‌రించ‌డంలో తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడూ ముందుంటారు. ఆ న‌మ్మ‌కంతోనే స్కైలాబ్ సినిమాను రూపొందిస్తున్నాం.  అమెరికా స్పేస్ స్టేష‌న్ నాసా ప్రయోగించిన స్పేస్ స్టేష‌న్ స్కైలాబ్ భూమిపై పడుతుందని, భూమి నాశనమైపోతుందని వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ప్రపంచమంతా అసలేం జరగబోతుందోనని ఊపిరి బిగపట్టి ఎదురుచూడసాగారు. ప్రపంచంలోని అన్నీ న్యూస్‌ చానెల్స్‌, వార్తా పత్రికలు ఈ వార్తను ప్రముఖంగా కవర్‌ చేశాయి. అలాంటి నేపథ్యంలో మన తెలుగు రాష్ట్ర్రంలో బండ లింగపల్లి అనే గ్రామంలో  ఉండే గౌరి, ఆనంద్‌, రామారావుల జీవితాల్లో స్కైలాబ్‌ వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే విషయాలను ఎంటర్‌టైనింగ్‌గా స్కైలాబ్ మూవీని 1979 లో సాగే పీరియాడిక్ మూవీగా తెర‌కెక్కించాం. స‌త్య‌దేవ్‌, నిత్యామీనన్, రాహుల్ రామ‌కృష్ణ  స‌హా అద్భుత‌మైన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు కుదిరారు. అనుకున్న ప్లానింగ్‌లోనే సినిమాను పూర్తి చేశాం. ఇప్పుడు సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్యక్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అవి కూడా ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకున్నాయి. రీసెంట్‌గా మెసడోనియన్ సింఫనీ ఆర్కెస్ట్రాతో సినిమాలో థీమ్స్‌ను రికార్డ్ చేయించాం. ఈ నెల‌లో థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేస్తాం. అలాగే త్వ‌ర‌లోనే థియేట‌ర్స్‌లో సినిమాను విడుద‌ల చేసేలా మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు అన్నారు. 

న‌టీన‌టులు: నిత్యామీన‌న్‌, స‌త్య‌దేవ్‌, రాహుల్ రామ‌కృష్ణ, తనికెళ్ల భరణి, తులసి, విష్ణు, అనుష త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు: మాట‌లు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: విశ్వక్ ఖండేరావు, నిర్మాత: పృథ్వీ పిన్నమరాజు, సహ నిర్మాత: నిత్యామీనన్‌, సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాది, ఎడిటర్‌: రవితేజ గిరిజాల, మ్యూజిక్‌: ప్ర‌శాంత్‌ ఆర్‌.విహారి, ప్రొడక్షన్‌ డిజైన్‌: శివం రావ్‌, సౌండ్ రికార్డిస్ట్‌‌: నాగార్జున త‌ల్ల‌ప‌ల్లి, సౌండ్‌ డిజైన్‌: ధ‌నుష్ న‌య‌నార్‌, కాస్ట్యూమ్స్‌: పూజిత తడికొండ, పి.ఆర్‌.ఒ: వంశీ కాక.

Skylab movie in theaters soon:

Sathyadev, Nithya Minan, Rahul Ramakrishna Skylab in post production stage
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs