Advertisement
Google Ads BL

మహా సముద్రం ప్రీ రిలీజ్ ఈవెంట్


శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్‌లో రాబోతోన్న మహా సముద్రం సినిమా మీద టాలీవుడ్‌లో ఎంతటి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. Rx 100 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు అజయ్ భూపతి విభిన్న కథాంశంతో మహా సముద్రం చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇన్‌టెన్స్ ల‌వ్‌, యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 14న రాబోతోన్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నేడు (శనివారం) హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హంచారు. ఈ కార్య‌క్ర‌మంలో...

Advertisement
CJ Advs

లిరిసిస్ట్  చేతన్ ప్రసాద్ మాట్లాడుతూ - మహాసముద్రం.. ఈ సినిమాలో రెండు పాటలు రాశాను. నేను రాసిన చెప్పకే చెప్పకే పాటకు మంచి స్పందన వచ్చింది. అజయ్ భూపతి ఓ మహా సముద్రం వంటి వ్య‌క్తి. అజయ్ లో మీకు తెలియని ఎన్నో రహస్యాలున్నాయి. అతను పైకి కనిపించే మనిషి లాంటి వాడు కాదు. ఈ కథ గురించి చర్చించేటపుడు సముద్రంలో ఉండే భావోద్వేగాలు కనిపిస్తాయి. అవే తీసుకొని ఆయన సినిమాల్లో పాటలు రాస్తుంటాను అన్నారు.

న‌టుడు రావు రామేష్ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ చెప్పినప్పుడు ఎంత ఎగ్జయిట్ అయ్యానో షూటింగ్ సమయంలో ఇంకా ఎగ్జయిట్ అయ్యాను.  ట్రైలర్ చూశాక మరింత ఎగ్జయిట్ అయ్యాను. ఈ సినిమా కార్యరూపం దాల్చడానికి కారణం శర్వానంద్, అనిల్ సుంకర. శర్వానంద్ చాలా కూల్. సిద్దార్థ్ గురించి చాలా విన్నా. కొన్ని క్యారెక్టర్స్ చేస్తుంటే ఇది రా మజా అంటే అనిపిస్తుంది. అలాంటి క్యారెక్టర్ ఇది. అజయ్  ఈ సినిమాను చాలెంజింగ్ గా చేశారు. ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా థాంక్స్ అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు అజయ్ భూపతి మాట్లాడుతూ.. మహా సముద్రం జర్నీ అనేది నా జీవితంలో మర్చిపోలేనిది. ఆర్ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఇద్దరు హీరోల కథలు రాసుకుని చాలామంది హీరోలను ఒప్పించడానికి ప్రయత్నం చేశాను. ఈ కథని అందరూ ఇష్టపడ్డారు. సోలోగానే హీరోగా చేయాలని అనుకున్న వాళ్లు కూడా ఈ కథ చాలా అద్భుతంగా ఉందని బయట చాలా మందితో చెప్పారు. ఆర్ఎక్స్ 100 సినిమా కంటే ముందే శర్వానంద్ తో ఒక సినిమా చేయాలని అనుకున్నాను. కానీ అప్పుడు ఆయనను కలిసే అవకాశం దొరకలేదు. ఇక రావు రమేష్ ద్వారా శర్వాని కలిసే అవకాశం దొరికింది. సిద్దార్థ్ కు శర్వానంద్ కంటే ముందే ఈ కథలు చెప్పి ఒప్పించాను.  ఇక శర్వానంద్ నేను అనిల్ సుంకరని వెళ్లి కలవడంతో వెంటనే ఒప్పేసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని అనుకున్న సమయంలోనే కరోనా అడ్డుపడింది. ఇక ఫస్ట్ వేవ్‌ అనంతరం షూటింగ్స్ మొదలుపెట్టినప్పుడు కేవలం నాలుగు నెలల్లోనే ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా పూర్తి చేయడం జరిగింది. నిజంగా ఇది ఒక భావోద్వేగాల ప్రేమ కథ. ఒకరి జీవితాలను మరొకరు జీవితాల పై ఎలాంటి ప్రభావం చూపించేది అనేది ఇందులోని ప్రధానాంశం. మహా సముద్రంలో ప్రతి ఒక్క ఎమోషన్ ఉంటుంది. మన సముద్రంలో హీరో అనేది కథ మాత్రమే. ఇద్దరు హీరోలను ఎలా హ్యాండిల్ చేస్తావో చూస్తాను అని రాంగోపాల్ వర్మ గారు కూడా అన్నారు. సిద్దార్థ్ శర్వానంద్ ఇద్దరు కూడా ఎంతగానో సపోర్ట్ చేశారు. వారిద్దరూ లేకపోతే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. నేను ఏది చెబితే అదే చేశారు. నిర్మాత అనిల్ సుంకర కూడా ఎంతగానో సపోర్ట్ చేశారు. అక్టోబర్ 14న తెలుగు సినిమా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ చూడబోతోంది. ఈ సినిమాలోని క్యారెక్టర్స్ ఎవరు మర్చిపోరు. నటీనటులు ఎవరు కూడా తెరపై కనిపించరు క్యారెక్టర్స్ మాత్రమే కనిపిస్తాయి. పక్కా ఇది బ్లాక్ బస్టర్ మూవీ. పోస్టర్ కూడా రెడీ చేసుకోండి.. మహాసముద్రంలో కొలవలేనంత ప్రేమను చూపించబోతున్నాము అన్నారు. 

హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. అజయ్ నాకు కథ చెప్పగానే నేను చాలా ఎగ్జైటింగ్ గా ఫీలయ్యాను. ఎలాగైనా ఈ సినిమా చేయాలని కథ చెప్పగానే ఫిక్స్ అయ్యాను. ఈ సినిమాలో నన్ను చాలా కొత్తగా చూస్తారు. స్మిత అనే పాత్ర నాకు ఇచ్చినందుకు డైరెక్టర్ అజయ్ భూపతి కి మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అలాగే నిర్మాతలు కూడా మంచి వాతావరణం క్రియేట్ చేసి ఎంతగానో సపోర్ట్ చేసారు. శరవణన్ ఈ సినిమాలో ఒక మంచి కో స్టార్ గా నటించారు. ఈ సినిమాలో అదితిరావు కూడా స్టన్నింగ్ పాత్రలో కనిపించనుంది. సినిమాకు మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది. అసిస్టెంట్ డైరెక్టర్స్ లేనిదే ఈ సినిమా అంత ఈజీగా పూర్తి చేయడం సాధ్యం కాదు. వాళ్లు ఎంతగానో సహకరించారు. ఈ నెల 14న మహాసముద్రం థియేటర్స్ లోకి రాబోతోంది. ఫ్యామిలీ అందరితో కలిసి చూడాలని కోరుకుంటున్నాను అన్నారు.

హీరోయిన్ అదితిరావు హైదారి మాట్లాడుతూ.. దాదాపు రెండేళ్ల తర్వాత ఇలా స్టేజి మీదకు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. సినిమా థియేటర్స్ లో భారీగా రిలీజ్ చేస్తున్నందుకు ముందుగా నిర్మాత అనిల్ సుంకర గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సినిమాలలో నన్ను మహా అనే పాత్రకు సెలెక్ట్ చేసుకున్నందుకు డైరెక్టర్ అజయ్ బుపతి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. డైరెక్టర్ అజయ్ భూపతి గారు మమ్మల్ని ఎంతో చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఆయన ఫ్యాషన్ పై కూడా ఎంతో గౌరవం పెరిగింది. కెమెరామెన్ కి కృతజ్ఞతలు ఎన్ని చెప్పిన సరిపోదు. మహా పాత్రను అంత‌ బాగా చూపించారు. చేతన్ భరద్వాజ్ కూడా ఈ సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చారు. అనుతో కూడా ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇక ఇద్దరు హీరోలు కూడా ఎంతో బాగా హార్డ్ వర్క్ చేశారు. నిజంగా ఈ మూవీ చాలా స్పెషల్ గా ఉంటుంది.. తప్పకుండా సినిమా అందరికీ నచ్చుతుంది.. అన్నారు.

నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. నేను మాట్లాడే ముందు ఒకరిని తప్పనిసరిగా గుర్తుచేసుకోవాలి. మా సంస్థకు మొదటి నుంచి కూడా PRగా పని చేసినటువంటి బిఏ రాజు గారు లేకుండా ఈ వేడుక జరుగుతుంది. ఆయన మన మధ్య లేరు ఆయనకు ప్రత్యేకంగా నివాళులు అర్పిస్తున్నాను. మహాసముద్రం విషయానికి వస్తే దర్శకుడు అజయ్ భూపతికి ఒక బేబీ లాంటి సినిమా. మొదట ఈ సినిమాను ఎందుకంత ప్రేమిస్తున్నాడు అని అనుకున్నాను. ఇద్దరు హీరోలు కావాలని పట్టుబట్టి అడిగాడు. ముందుగా అతని ధైర్యం నాకు చాలా బాగా నచ్చింది. కాన్ఫిడెన్స్ కూడా ఎంతగానో నచ్చింది. ఆర్ఎక్స్100 చూసిన తర్వాత భూపతి మాత్రమే ఇలాంటి కథను హ్యాండిల్ చేయగలడు అని అనిపించింది. ఈ సినిమాకు ఇద్దరు హీరోలు ఇద్దరు హీరోయిన్స్ కూడా బాగా సెట్టయ్యారు. అలాగే రావు రమేష్ బాబు కూడా ఎంతగానో సపోర్ట్ చేశారు. సినిమాకు ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడి వర్క్ చేశారు మ్యూజిక్ కెమెరా పనితనం గురించి కూడా చాలా మంది అడిగారు. ముఖ్యంగా చేతన్ భరద్వాజ్ కు ఈ సినిమా మంచి భవిష్యత్తు ఇస్తుందని అనుకుంటున్నాను. అందరు కూడా ఈ సినిమాను థియేటర్స్ లో విడుదల చేస్తున్నందుకు పొగుడుతున్నారు. కానీ ప్రతి ఒక్కరి బాధ్యత  ముందుగా ప్రతి ఒక్క సినిమాను కూడా థియేటర్లోనే విడుదల చేయాలి. సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఎమోషనల్ గా ఫీల్ అవుతారు. అక్టోబర్ 14న విడుదల కాబోయే ఈ సినిమా అందరికి బాగా నచ్చుతుందని.. అనుకుంటున్నాను అన్నారు. 

హీరో సిద్ధార్థ్ మాట్లాడుతూ... నాకు తెలుగు ప్రేక్షకులకు చాలా గ్యాప్ ఉందని విన్నాను. కానీ ఎలాంటి గ్యాప్ లేదని అర్థమవుతుంది. అందరికీ ఇష్టమైన మూవీ బొమ్మరిల్లు. నేటి టీనేజ్ పిల్లలు మీ పేరెంట్స్ ను అడగండి బొమ్మరిల్లునీ ఎంతగా ఇష్టపడ్డారో.. మొదట తెలుగు ప్రేక్షకులే నన్ను హీరోని చేశారు. నాకు వాళ్ళు ఒక సూర్యుడితో సమానం. వాళ్లే నాకు స్టార్డమ్ అనే వెలుగును ఇచ్చారు. ఇలాంటి వేడుక గురించి నేను తొమ్మిది సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాను. అజయ్ భూపతిని నన్ను కలిపినందుకు జెమినీ కిరణ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నిర్మాత గారికి కూడా చాలా థాంక్స్. ఎందుకంటే ఆయన అన్న లాగా చూసుకున్నారు. ఈ సినిమాలో పని చేసిన టెక్నీషియన్స్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. ట్రైలర్ చూసిన తర్వాత చాలా ఇండస్ట్రీల నుండి నుంచి నాకు ఫోన్స్ వచ్చాయి. ముందుగా దర్శకుడు అజయ్ భూపతిని పొగిడాలి.  రాజ్ ఫోటోగ్రఫీ తర్వాత చేతన్ మ్యూజిక్ ఈ సినిమా స్థాయిని మరింత పెంచాయి. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. హీరోయిన్స్ తో పాటు జగపతి బాబు రావు రమేష్ వంటి నటులు కూడా సినిమాలో అద్భుతంగా నటించారు కేవలం సినిమాల్లోనే కాకుండా సినిమా వెనుక కూడా వారి పాత్ర చాలానే ఉంది. ఈ సినిమాతో నాకు మంచి మిత్రులు దొరికారు. ముఖ్యంగా శర్వా నాకు దొరికాడు. అతనికి ఐ లవ్యూ చెబుతున్నాను. శర్వా వచ్చిన తరువాతే ఈ సినిమా స్థాయి పెరిగింది. అజయ్ భూపతి చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. ఇది నాకు ఒక రీ లాంచ్ అవుతుంద‌ని ఆశిస్తున్నాను. చాలా కాలం తరువాత అజయ్ నన్ను తెలుగు ప్రేక్షకుల ముందుకి తీసుకు వస్తున్నందుకు చాలా థాంక్యూ. ఈ సినిమాలో కొలవలేనంత ప్రేమ ఉంటుంది. తప్పకుండా ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుందని న‌మ్ముతున్నాను.. ఇక ఆక్టోబర్ 14న మనం థియేటర్స్ లో కలుద్దాం..అన్నారు. 

హీరో శర్వానంద్ మాట్లాడుతూ.. సిద్దార్థ్ ఈ సినిమా శర్వానంద్ సినిమా అని చెప్పాడు అందుకు నేను ఏమాత్రం ఒప్పుకోను. ఒక సినిమాలో  డైలాగ్ ఉంటుంది అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలే తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో.. అలానే మ‌హా సముద్రంలో కూడా కథ మాత్రమే హీరో. తప్పకుండా ఇది విడుదలయ్యాక తెలుగు సినిమారా అని అందరూ గర్వంగా చెబుతారు. రావు రమేష్ గారు మొదట ఈ కథ గురించి నాకు చెప్పారు. నేను కథ విన్నాక చేస్తాను అని చెప్పాను. అనిల్ సుంకర తో మాట్లాడిన తరువాత ఆయన వెంటనే ఒప్పేసుకున్నారు. మూడు రోజుల్లో సినిమా ఓకే అయిపోయింది.  9 మందితో కొనసాగే ఈ కథ చాలా బావుంటుంది. దర్శకుడు చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు అజయ్ కు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మహాసముద్రం సినిమా అనేది లవ్ స్టొరీ. ఎక్కువగా మహా పాత్ర‌ చుట్టే ఉంటుంది. అలాంటి పాత్ర చేయడం చాలా కష్టం. అదితి చాలా బాగా చేసింది. అను కూడా చాలా బాగా వర్క్ చేసింది. ఇక ఈ సినిమాతో  సిద్దార్థ్ వంటి మంచి స్నేహితుడు దొరికాడు అని చెప్పడంతోనే సినిమా సక్సెస్ అని అర్థమైపోయింది. అందరూ శర్వా స్టార్ అన్నా కూడా వాడు ఎప్పటి నుంచో ఒక స్టార్. రంగ్ దే బసంతి, బొమ్మరిల్లు వంటి ఎన్నో గొప్ప సినిమాలు చేసి హంబుల్ గా మాట్లాడుతున్నాడు. అదే అతని గొప్పతనం. తప్పకుండా ఈ సినిమా అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. ఆక్టోబర్ 14న ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. అంటే దసరాకు. ప్రతి పండగ సమయంలో నేను హిట్ కొట్టాను. ఇప్పుడు కూడా మహాసముద్రంతో హిట్ కొడుతున్నాం అన్నారు. 

Maha Samudram Pre Release Event:

Sharwanand - Siddarth Maha Samudram Pre Release Event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs