Advertisement
Google Ads BL

రెడీ టు రిలీజ్ రాజా విక్రమార్క


యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ రాజా విక్రమార్క. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో 88 రామారెడ్డి నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కార్తికేయ సరసన సీనియర్ తమిళ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ హీరోయిన్‌గా నటించారు. సినిమా చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం రీ-రికార్డింగ్ పనుల్లో నిమగ్నం అయ్యారు.

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా నిర్మాత 88 రామారెడ్డి మాట్లాడుతూ మా రాజా విక్రమార్క కథంతా హైదరాబాద్ నేపథ్యంలో జరుగుతుంది. ఇందులో గుడిలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. కథ ప్రకారం పురావస్తు శాఖవారు క్లోజ్ చేసిన టెంపుల్ అయ్యి ఉండాలి. లక్కీగా మాకు గండికోటలో అటువంటి టెంపుల్ దొరికింది. అందులో దర్భార్ సెట్ వేసి కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. గర్భగుడి వరకు అనుమతి ఇచ్చారు. మారేడుమిల్లిలో అందరూ చిత్రీకరిస్తున్న లొకేష‌న్‌లో కాకుండా... యునీక్ లొకేష‌న్‌కు వెళ్లి, భారీ రబ్బరు ఫారెస్టులో కీలక సన్నివేశాలు తీశాం. డంప్ యార్డ్‌లో ప్రీ క్లైమాక్స్ షూట్ చేశాం. మేకింగ్ పరంగా ఎక్కడ రాజీ పడలేదు. హీరో కార్తికేయ సహకారంతో సినిమా బాగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయిన తర్వాత, అతి త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం అని అన్నారు.

దర్శకుడు శ్రీ సరిపల్లి మాట్లాడుతూ కార్తికేయ క్యారెక్టరైజేషన్ సినిమాకు హైలైట్ అవుతుంది. ఆయన ఎన్ఐఏ ఏజెంట్‌గా కనిపిస్తారు. ఎంట‌ర్టైనింగ్‌గా సాగే యాక్షన్ రోల్‌కు కార్తికేయ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ దాదాపు పూర్తయింది. రీ-రికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమాను మీ ముందుకు తీసుకురావాలని ఉంది అని అన్నారు.

కార్తికేయ గుమ్మకొండ, తాన్యా రవిచంద్రన్ జంటగా నటించిన ఈ సినిమాలో సుధాకర్ కోమాకుల, సాయికుమార్, తనికెళ్ళ భరణి, పశుపతి, హర్షవర్ధన్, సూర్య, జెమిని సురేష్, జబర్దస్త్ నవీన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

Kartikeya Raja Vikramarka gets ready for Release:

Hero Kartikeya Raja Vikramarka gets ready for Release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs