Advertisement
Google Ads BL

అక్టోబర్ 8న జీ 5 లో రాజ రాజ చోర


అక్టోబర్ 8న జీ 5 లో రాజ రాజ చోర విడుదల

Advertisement
CJ Advs

జీ 5 ఓటీటీ ఉండగా వినోదానికి లోటు ఉండదనేది వీక్షకులు చెప్పేమాట! తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ.. పలు భారతీయ భాషల్లో, వివిధ జానర్లలో ఎప్పటికప్పుడు సరికొత్త వెబ్‌ సిరీస్‌లు, డైరెక్ట్‌–టు–డిజిటల్‌ రిలీజ్‌ మూవీస్‌తో పాటు కొత్త సినిమాలను వీక్షకులకు అందిస్తూ 24/7 వినోదాన్ని అందిస్తుంది. ప్రస్తుతం అలాంటి సిత్రాలును డైరెక్ట్ డిజిటల్ చేసిన జీ 5 ఓటీటీ వేదిక.. విజయదశమి కానుకగా వినోదాల విందు అందివ్వడానికి సిద్ధమైంది.

ప్రామిసింగ్ స్టార్ శ్రీ విష్ణు కథానాయకుడిగా నటించిన చిత్రం రాజ రాజ చోర. కరోనా సెకండ్ వేవ్ తర్వాత.. ఆగస్టు 19న థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకులను నవ్వించడంతో పాటు మంచి సందేశం ఇచ్చింది. దసరా కానుకగా ఈ చిత్రాన్ని జీ 5 ఓటీటీ వేదికలో విడుదల చేయనున్నారు.

హసిత్ గోలి దర్శకుడిగా పరిచయమైన రాజ రాజ చోర సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతోపాటు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించింది. దొంగ గా శ్రీ విష్ణు.. అతని భార్యగా సునైన, ప్రేయసిగా మేఘా ఆకాష్, ఇతర పాత్రల్లో రవి బాబు, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్, గంగవ్వ, తనికెళ్ల భరణి తదితరుల నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి. వివేక్ సాగర్ సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ దసరాకు ఓటీటీలో ఇంటిల్లిపాది కలిసి చూస్తూ నవ్వుకునే సినిమా రాజ రాజ చోర అవుతుందని అనడంలో ఎటువంటి సందేహం లేదు. విజయదశమి తర్వాత.. ఈ నెల 22న హెడ్స్ అండ్ టేల్స్ సినిమాను జీ 5 విడుదల చేయనుంది.

Raja Raja Chora released on ZEE5 on October 8th:

ZEE5 to stream Raja Raja Chora on 8th October 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs