Advertisement
Google Ads BL

కథను బట్టే మ్యూజిక్ -మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్


మహాసముద్రం లాంటి సినిమాను ఈ మధ్య కాలంలో చూసి ఉండరు - మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్

Advertisement
CJ Advs

శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్‌లో రాబోతోన్న మహా సముద్రం సినిమా మీద టాలీవుడ్‌లో ఎంతటి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. ఆర్ ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు అజయ్ భూపతి విభిన్న కథాంశంతో మహా సముద్రం చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇన్‌టెన్స్ ల‌వ్‌, యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 14న రాబోతోన్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను స్పీడు పెంచేశారు. ఈ క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ సినీజోష్ తో ముచ్చటించారు. ఆ విశేషాలు

-మహా సముద్రం ఎంతో ఇంటెన్స్ ఎమోషన్స్ ఉన్న సినిమా. ఈ  చిత్రం చూసిన ప్రేక్షకులు కచ్చితంగా ఓ మౌనంతో వెళ్తారు. చివరి 40 నిమిషాలు మాత్రం ఎవ్వరూ ఏం మాట్లాడకుండా చూస్తారు. సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నాం.

-మనిషి జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో అదే మహాసముద్రం. అమాయకపు మనుషుల జీవిత కథలే ఇందులో కనిపిస్తాయి. ఇలాంటి ఇంటెన్స్ ఎమోషన్స్ ఉన్న సినిమాకు బ్యాక్ గ్రౌండ్  స్కోర్ ఇవ్వడం నాకు  చాలెంజింగ్ మారింది. ఎన్ని రకాలుగా ఇవ్వొచ్చనే విషయం కూడా తెలిసింది. అంద‌రి అంచనాలు మించేలా సినిమా ఉంటుంది.

-మ్యూజిక్ అనేది కథకు అనుగుణంగానే ఇస్తాను. కథ బాగుంటే.. మ్యూజిక్ కూడా బాగుంటుంది. కథను బట్టే మ్యూజిక్ ఇవ్వడానికి నేను ఎక్కువగా ఇస్తుంటాను.

-ఆర్ఎక్స్ 100 సినిమాలో కంటే ఎక్కువ ట్విస్ట్‌లు మహాసముద్రంలో ఉంటాయి. ఇందులో దాదాపు ఐదారు ట్విస్ట్‌లుంటాయి. అందులో  ఒకే ఎమోషన్ ఉంటుంది. కానీ ఇందులో మల్టిపుల్ ఎమోషన్స్ ఉంటాయి. ఒక అతీంద్రియ శక్తి మనిషిని ఎన్నిరకాలుగా మార్చుతుంది.. టైం, విధి మనిషిని ఎన్ని రకాలుగా మార్చుతుందనేది చూపించబోతోన్నాం.

-ఆర్ఎక్స్ 100 సినిమాకు చేసిన ప్రయోగాన్ని ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నారు. బాగా ఆదరించారు. ఇప్పుడు ఈ సినిమాకు ఒళ్లు దగ్గరపెట్టుకుని మరింత జాగ్రత్తగా చేశాను. కచ్చితంగా మహాసముద్రం కూడా అందరినీ ఆకట్టుకుంటుంది.

-మహా అనే క్యారెక్టర్ చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. ఆమె జీవితంలో జరిగే ఘటనల ద్వారా చుట్టూ ఉన్న వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది కథ.

-కొన్ని కొన్ని జానర్స్ మూవీ సెంట్రిక్‌గా చేయాల్సి ఉంటుంది. మూవీకి ఆ పర్టిక్యులర్ సీన్‌కు పాట ఆడియెన్స్‌కు కనెక్ట్ అయితే.. ఆపాట హిట్టైనట్టే. ఆర్ఎక్స్  100 సినిమా అనేది ఎమోషన్స్, లవ్, యాక్షన్ అన్ని కలిపి ఉంటాయి. ఆ సినిమాలోని పాటలు ఆడియెన్స్‌ను కనెక్ట్ అయ్యాయి. ఆ సెక్షన్ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యాయంటే హిట్ అయినట్టే. మహా సముద్రం సినిమాలో  నాకు చెప్పకే చెప్పకే అనే పాట ఎక్కువగా ఇష్టం. మంచి మూమెంట్‌లో ఆ పాట వస్తుంది. హే రంభా అనే పాట పాడటం నాకు సంతోషంగా ఉంది.

-నాకు కథను ఎంతో క్లియర్‌గా, డీటైల్డ్‌గా చెప్పారు. నా టోన్ ఆ స్టోరీకి సరిపోతుందని అజయ్ భూపతి గారు నమ్మారు. లైవ్ బేస్డ్‌ ఎలిమెంట్స్ చేసే స్కోప్ ఇచ్చారు. నాకు డీటైల్డ్ ఎమోషన్ కనుక్కుని మ్యూజిక్ ఇవ్వడం ఇష్టం. అందుకే నేను చేసిన ప్రతీ అటెంప్ట్ పాజిటివ్‌గానే తీసుకున్నారు.

-ప్రతీ ఒక్కరూ అద్బుతంగా నటించేశారు. అంత ఇంటెన్స్ ఉన్న సినిమాను ఈ మధ్య కాలంలో చూసి ఉండరు. ప్రతీ ఒక్క పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్  చేయడం చాలా కష్టంగా అనిపించినా.. చాలెంజింగ్‌గా తీసుకున్నాను.

-పాటను జనాలకు రీచ్ అయ్యేట్టుగా సంగీతం ఇవ్వాల్సి ఉంటుంది. కథను తగ్గట్టుగానూ ఉండాలి. అందుకే పాటలు చేసేటప్పుడే రెండు రకాలుగా ఆలోచిస్తాను. సినిమాను ముందుకు తీసుకెళ్లేలా ఉండాలని, జనాలకు నచ్చే విధంగా ఉండాలనుకుంటాను. ఈ సినిమాలో చెప్పకే చెప్పకే అనే పాటకు ఎక్కువ సమయం తీసుకున్నాను.

-లిరిక్ రైటర్స్ చాలా కష్టపడి రాశారు. పాటలో అమాయకత్వం, సిట్యువేషన్‌కు తగ్గట్టు పాట, పాటకు తగ్గ లిరిక్స్ అన్నీ ఇలా కుదిరాయి. చైతన్య ప్రసాద్, భాస్కరభట్ల, కిట్టు విశ్వప్రగడ అందరూ అద్భుతంగా రాశారు. సినిమాలోని ఎమోషన్‌ను ముందుకు తీసుకెళ్లారు.

-బ్యాక్ గ్రౌండ్ కన్నా.. సాంగ్స్ చేయడమే నాకు ఇష్టం. పాటలు చేయడంలో ఫ్రీడం ఎక్కువగా ఉంటుంది. ఆర్ఎక్స్ 100లో రుధిరం, ఎస్ఆర్ కళ్యాణమండపంలోని చుక్కల చున్నీ బాగా ఇష్టం. ఆనంద్ దేవరకొండ సినిమా ఒకటి చర్చల్లో ఉంది.

-పాటలు ఎప్పుడూ కూడా సినిమాకు తగ్గట్టే ఉండాలి.  పాటలను బట్టే సినిమాలను చూస్తున్నారు. ఆర్ఎక్స్ 100 సినిమాకు అంత ఆదరణ ఇచ్చినందుకు ప్రేక్షకులకు రుణపడి ఉంటాను. నా జర్నీ నాకు ఎంతో సంతృప్తిగా ఉంది.

Music Director Chetan Bhardwaj Interview:

<span>Music that tells the story -</span>Music Director Chetan Bhardwaj
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs