Advertisement
Google Ads BL

F3 సెట్లో సంద‌డి చేసిన ఐకాన్‌స్టార్


వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్‌, అనిల్ రావిపూడి, శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ఎఫ్ 3 సెట్లో సంద‌డి చేసిన ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్

Advertisement
CJ Advs

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్‌లో వచ్చిన ఎఫ్ 2 చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్‌గా మూడు రెట్లు ఎక్కువ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో ఎఫ్ 3 చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి. ఎఫ్ 3 సెట్‌ను ప్ర‌త్యేక అతిథి సంద‌ర్శించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అకస్మాత్తుగా ఎఫ్‌త్రీ సెట్ కి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ విడుద‌ల‌చేసిన ఫోటోలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రాజేంద్ర ప్రసాద్, సునీల్ మరియు దర్శకుడు అనిల్ రావిపూడితో అల్లు అర్జున్ ముచ్చ‌టిస్తూ క‌నిపించారు. అంద‌రి ముఖాల్లో సంతోషం ఉంది. ఈ సినిమా కోసం ఎంటైర్ టీమ్ ఫుల్ ఎన‌ర్జితో ప‌ని చేస్తోంది. అల్లు అర్జున్ సెట్‌కి రావ‌డంతో టీమ్‌లో కాన్ఫిడెన్స్ లెవల్స్ మ‌రింత పెరిగాయి.

F3 మూవీ సుదీర్ఘమైన షూటింగ్ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రధాన తారాగణంతో పాటు, ఇతర ఆర్టిస్టులు ఈ  కీల‌క‌మైన షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. వెంకటేష్, వరుణ్ తేజ్ సరసన తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్లుగా నటిస్తున్నారు, సునీల్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రంలో ఒక అద్భుతమైన తారాగణం కూడా ఉంది. ఎఫ్ 2 సినిమాలో దేవీ శ్రీ ప్రసాద్ అందించిన ఆల్బమ్ ఎంతగా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఎఫ్ 3 కోసం సూప‌ర్‌హిట్ ఆల్బ‌మ్‌ సిద్దం చేశారు దేవీ శ్రీ ప్రసాద్. సాయి శ్రీరామ్ కెమెరామెన్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. హర్షిత్ రెడ్డి సహ నిర్మాతగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

నటీనటులు: వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, సునీల్ తదితరులు.

సాంకేతిక నిపుణులు: దర్శకత్వం: అనిల్ రావిపూడి, సమర్పణ: దిల్ రాజు, నిర్మాత: శిరీష్, బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, కో ప్రొడ్యూసర్: హర్షిత్ రెడ్డి, సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్, కెమెరామెన్: సాయి శ్రీరామ్, ఆర్ట్: ఏఎస్ ప్రకాష్, ఎడిటింగ్: తమ్మిరాజు, స్క్రిప్ట్ కో ఆర్డినేటర్స్: ఎస్ కృష్ణ, అడిషనల్ స్క్రీన్ ప్లే: ఆది నారాయణ, నారా ప్రవీణ్.

Allu Arjun Visits The Sets Of Venkatesh, Varun Tej, F3:

<span>Allu Arjun Visits The Sets Of Venkatesh, Varun Tej, F3</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs