Advertisement
Google Ads BL

సేవాదాస్ సాంగ్స్ రిలీజ్


అమాత్యులు-పార్లమెంట్ & శాసన సభ్యులు- అతిరథ మహారథుల సమక్షంలో సేవాదాస్ సాంగ్స్ రిలీజ్ ఫంక్షన్! ముఖ్య అతిధులుగా విచ్చేసిన మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ -సత్యవతి రాథోడ్ మరియు పలువురు పార్లమెంట్ & శాసనసభ్యులు, ఐఎఎస్-ఐపీఎస్ ఆఫీసర్స్!

Advertisement
CJ Advs

శ్రీశ్రీ హథీరామ్ బాలాజీ క్రియేషన్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి కె.పి.ఎన్. చౌహాన్ దర్శకత్వంలో.. ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్ సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక బహుభాషా చిత్రం సేవాదాస్. సీనియర్ హీరోలు సుమన్, భానుచందర్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో కె.పి.ఎన్. చౌహాన్, ప్రీతి అస్రాని హీరో హీరోయిన్లు. కె.పి.ఎన్.చౌహాన్ దర్శకత్వంలో బంజారా-తెలుగు- ఇంగ్లీష్-హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఆడియో వేడుక హైద్రాబాద్ లోని రవీంద్రభారతిలో అత్యంత కోలాహలంగా జరిగింది. భోలే షావలి ఈ చిత్రానికి సంగీత సారధ్యం వహించారు.

బంజారా సంప్రదాయపు డప్పులు, నృత్యాలు, వేషధారణలతో ఆద్యంతం ఆసక్తికరంగా నిర్వహించిన ఈ వేడుకలో తెలంగాణ మత్స్య-సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, గిరిజన మరియు మహిళా సంక్షేమ శాఖామాత్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎమ్.పి శ్రీమతి మాలోత్ కవిత, ఇల్లందు ఎమ్మెల్యే శ్రీమతి హరిప్రియ బానోత్, ఖానాపూర్ ఎమ్.ఎల్.ఎ. శ్రీమతి రేఖా శ్యామ్ నాయక్, డోర్నకల్ ఎమ్.ఎల్.ఎ. రెడ్యా నాయక్, మహబూబాబాద్ ఎమ్.ఎల్.ఎ. శంకర్ నాయక్, వైరా ఎమ్.ఎల్.ఎ. ఎల్.రాములు నాయక్, దేవరకొండ ఎమ్.ఎల్.ఎ. రవీంద్ర నాయక్, బోద్ ఎమ్.ఎల్.ఎ. రాథోడ్ బాబూరావు, మహబూబాబాద్ మాజీ పార్లమెంటు సభ్యులు అజ్మీరా సీతారాం నాయక్ లతోపాటు తెలంగాణవ్యాప్తంగా గల పలువురు ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్, ఐ.ఆర్.ఎస్ అధికారులు పెద్ద సంఖ్యలో విశిష్ట అతిధులుగా పాల్గొన్నారు. ఈ చిత్రంలో సేవాదాస్ గా టైటిల్ రోల్ ప్లే చేసిన సుమన్, కీలకపాత్ర పోషించిన భానుచందర్, చిత్ర దర్శకుడు-కథానాయకుడు కె.పి.ఎన్.చౌహాన్, హీరోయిన్ ప్రీతి అస్రాని, గీతా సింగ్ సేవాదాస్ చిత్రంలో నటించే అవకాశం లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఇది ఆడియో వేడుకలా లేదు. శత దినోత్సవ వేడుకలా ఉంది. సేవాదాస్ చిత్రం కచ్చితంగా 100 రోజులాడాలి. ఆ వేడుకకు కూడా ముఖ్య అతిధిగా నన్ను పిలవాలి అన్నారు.

మరో ముఖ్య అతిధి మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. బంజారా బిడ్డలు బంజారా భాషలోనే కాకుండా తెలుగు-ఇంగ్లీష్-హిందీ భాషల్లో తీసిన సేవాదాస్ ఆడియో ఫంక్షన్ లో పాల్గొనడం గర్వంగా ఉంది అన్నారు.

నిర్మాతలు ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్ మాట్లాడుతూ.. సేవాదాస్ రూపకల్పన కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. ఈనెల 15న ఇల్లందులో ప్రి-రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేసి, ఈనెలాఖరుకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం అన్నారు.

వినోద్ రైనా, ఎస్.ఆర్.ఎస్. ప్రసాద్, విజయ్ రంగరాజు, చలాకీ చంటి, సంపత్ నాయక్, గీతా సింగ్, ఫిష్ వెంకట్, నవీనా రెడ్డి, శైలజ, రేఖ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, అసోసియేట్ డైరెక్టర్స్: రాజేంద్రప్రసాద్ చిరుత-రవితేజ-సంజయ్ భూషణ్-సాయి కుమార్, కో-డైరెక్టర్స్; ఎన్టీఆర్ సుబ్బు-నవీన్, వి ఎఫ్ ఎక్స్: కిషోర్ కాలకూరి, ఆర్ట్ డైరెక్టర్: విజయ్.ఎ, ప్రొడక్షన్ కంట్రోలర్: లక్ష్మణరావు-శ్రీరాములు, కెమెరామెన్: విజయ్ టాగోర్, ఎడిటర్: ప్రదీప్, పోస్ట్ ప్రొడక్షన్: రామానాయుడు స్టూడియోస్, నిర్మాతలు: ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్, కథ-స్క్రీన్ ప్లే-డైరెక్షన్; కె.పి.ఎన్. చౌహాన్.

Sevadas Movie Songs Release:

Sevadas Movie Audio Function
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs