అమెజాన్ ప్రైమ్ లో మంచి ఆదరణ అందుకుంటున్న పరిగెత్తు పరిగెత్తు
ఇటీవల కాలంలో చిన్న సినిమాలకు మంచి ఆదరణ కల్పిస్తున్నారు ప్రేక్షకులు. కంటెంట్ బాగుంటే తప్పకుండా సినిమా ను చూస్తామని మరొకసారి పరిగెత్తు పరిగెత్తు సినిమా ద్వారా నిరూపించారు. ఈమధ్యనే థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఎంతగానో అలరించింది ఈ సినిమా. విమర్శకుల ప్రశంశలు అందుకున్న ఈ సినిమా లాంగ్ రన్ లో మంచి కలెక్షన్లు అందుకుని సూపర్ హిట్ సినిమా గా నిలవగా ఈ సినిమా తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో కూడా స్ట్రీమ్ అవుతూ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటూ ఉన్నది. సూర్య శ్రీనివాస్, అమృత ఆచార్య హీరో హీరోయిన్ లుగా నటించిన ఈ సినిమా కి రామకృష్ణ తోట దర్శకత్వం వహించగా ఎన్ ఎస్ సినీ ఫ్లిక్స్ పతాకంపై ఏ యామిని కృష్ణ నిర్మించారు.
నిర్మాత యామిని కృష్ణ మాట్లాడుతూ.. థియేటర్లలో విడుదలై మంచి పేరు సంపాదించుకున్న పరిగెత్తు పరిగెత్తు సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో కూడా విడుదలై ప్రేక్షకుల మన్ననలను పొందుతుంది. మా సినిమా కి ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇదే స్ఫూర్తి తో ఇలాంటి మంచి మంచి సినిమాలు ఇంకా నిర్మిస్తాను. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అన్నారు.
దర్శకుడు రామకృష్ణ తోట మాట్లాడుతూ.. మా సినిమా ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షక దేవుడికి ధన్యవాదాలు. మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మా సినిమా అందరికి ఇంత బాగా నచ్చడం సంతోషంగా ఉంది. నిర్మాత నమ్మకాన్ని నిలబెట్టినందుకు సంతోషంగా ఉంది. ధియేటర్ లలో సినిమాలు విడుదల చేయడానికి భయపడుతున్న సమయంలో మా సినిమా ను ధియేటర్ లలో విడుదల చేసి ధైర్యం చేశాము. ప్రేక్షకులు కూడా సినిమా ను చాలా బాగా ఆదరించారు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో కూడా మా సినిమా కి మంచి పేరొస్తుంది. నేను ఇంత మంచి సినిమా చేయడానికి సహాయపడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు అన్నారు.