Advertisement
Google Ads BL

నవంబర్ 12న పుష్పక విమానం


యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన కొత్త చిత్రం పుష్పక విమానం రిలీజ్ కు రెడీ అవుతోంది. నవంబర్ 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రాల తర్వాత ఆనంద్ దేవరకొండ నటిస్తున్న పుష్పక విమానం సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. 

Advertisement
CJ Advs

పుష్పక విమానం చిత్రాన్ని నూతన దర్శకుడు దామోదర తెరకెక్కించారు. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీ ని కింగ్ అఫ్ ది హిల్ ప్రొడక్షన్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. గోవర్ధన్ రావు దేవరకొండ,విజయ్ దషి ,ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలు. పాండమిక్ వల్ల విడుదల కోసం వేచి చూసిన పుష్పక విమానం టీమ్ సరైన డేట్ ను ఫిక్స్ చేసుకుంది. నవంబర్ 12న సినిమా విడుదలకు ముహూర్తం నిర్ణయించింది. పుష్పక విమానం చిత్రంలోని కళ్యాణం కమనీయం పాట ఇప్పటికే సూపర్ హిట్టయి సినిమాకు ఆకర్షణగా నిలించింది. రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా

డైరెక్టర్ దామోదర మాట్లాడుతూ...పుష్పక విమానం ఒక కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. ఇందులో ఆనంద్ ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా కనిపిస్తారు. ఈ కథ ప్రధానంగా మధ్యతరగతి కుటుంబాలలో వుండే డ్రామా ని గుర్తుచేస్తూ , పెళ్లి చుట్టూ వుండే  పరిస్థితులని చూపెడుతుంది . ఇది ఫ్యామిలీ అంతా చూడదగ్గ కామెడీ చిత్రం. నవంబర్ 12న థియేటర్లలో కలుసుకుందాం అన్నారు

Pushpaka Vimanam release date fix:

Anand Deverakonda Pushpaka Vimanam release date fix
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs