ఆది సాయి కుమార్ అతిధి దేవో భవ నుండి సిద్ శ్రీరామ్ పాడిన బాగుంటుంది నువ్వు నవ్వితే పాట విడుదల
ఆది సాయి కుమార్, నువేక్ష హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం అతిధి దేవో భవ. శ్రీనివాస క్రియేషన్స్ పతాకంపై రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పొలిమేర నాగేశ్వర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి మొదటిపాటగా ఓ ప్రేమ గీతాన్ని విడుదలచేశారు. ఆ పాట సంగీత ప్రియుల్ని అలరిస్తోంది. బాగుంటుంది నువ్వు నవ్వితే అంటూ సాగే ఈ గీతానికి భాస్కర భట్ల సాహిత్యం అందించగా లేటెస్ట్ సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్, నూతన మోహన కలిసి ఈ పాటను ఆలపించారు. శేఖర్ చంద్ర మంచి బాణీలు సమకూర్చారు. యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతోంది.
ఈ పాటతో సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని మేకర్స్ ప్రకటించబోతోన్నారు. ఈ సినిమాకు అమరనాథ్ బొమ్మిరెడ్డి కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.
నటీనటులు: ఆది సాయి కుమార్, నువేక్ష.
సాంకేతిక బృందం: దర్శకత్వం: పొలిమేర నాగేశ్వర్, నిర్మాతలు : రాజబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల, బ్యానర్ : శ్రీనివాస సినీ క్రియేషన్స్, సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరామెన్: అమరనాథ్ బొమ్మిరెడ్డి, ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్, పీఆర్ఓ : వంశీ - శేఖర్.