Advertisement
Google Ads BL

ఆసక్తిగా మహాసముద్రం ట్రైలర్ -ప్రభాస్


మహాసముద్రం ట్రైలర్ ఎంతో ఇంటెన్స్‌తో ఆసక్తిని రేకెత్తించేలా ఉంది  - పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్

Advertisement
CJ Advs

శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్‌లో రాబోతోన్న మహా సముద్రం సినిమా మీద టాలీవుడ్‌లో ఎంతటి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. ఆర్ ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు అజయ్ భూపతి విభిన్న కథాంశంతో  మహా సముద్రం చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇన్‌టెన్స్ ల‌వ్‌, యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు.

దసరా కానుకగా అక్టోబర్ 14న రాబోతోన్న ఈ సినిమా ట్రైలర్‌ను సెప్టెంబర్ 23న విడుదల చేశారు. ఎమోష‌న్స్‌, యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌ను ఫ‌ర్‌ఫెక్ట్‌గా బ్లెండ్ చేసిన ఈ ట్రైల‌ర్  సోష‌ల్ మీడియాలో దూసుకుపోతుంది. రిలీజైన రెండు రోజుల్లోనే  4.5మిలియన్ల వ్యూస్‌తో ఇప్పటికీ నెం.1 ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పటికే ఈ ట్రైలర్ ఎంతో మంది సెలెబ్రిటీలను ఆకట్టుకుంది. ఇక తాజాగా పాన్ ఇండియన్ స్టార్ ట్రైల‌ర్ పై స్పందించారు.

మహా సముద్రం ట్రైల‌ర్ ఎంతో ఇంటెన్స్‌తో ఉంది. అలాగే ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. శర్వానంద్, సిద్దార్థ్చ మ‌హాస‌ముద్రం టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్ అని పాన్ఇండియా స్టార్ ప్రభాస్ ప్రశంసలు కురిపించారు. ఈ సంద‌ర్భంగా బాహుబలి స్టార్ ప్ర‌భాస్ కి మ‌హా స‌ముద్రం టీమ్ ధ‌న్య‌వాదాలు తెలిపింది.

అదితీ రావ్ హైదరీ, అను ఇమాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు, రావు రమేష్, కేజీయఫ్ రామచంద్ర కీల‌క‌పాత్ర‌ల్లో కనిపించ‌నున్నారు. చేతన్ భరద్వాజ్ స్వ‌ర‌ప‌రిచిన అన్ని పాటలు శ్రోత‌ల‌ని ఆకట్టుకున్నాయి. ఇన్‌టెన్స్ ల‌వ్‌, యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు.  రాజ్ తోట సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి ప్ర‌వీణ్ కె.ఎల్ ఎడిట‌ర్‌, కొల్లా అవినాష్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌.

నటీన‌టులు: శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్‌, జ‌గ‌ప‌తిబాబు, అదితిరావు హైద‌రీ, అను ఇమ్మాన్యుయేల్ త‌దిత‌రులు.

Maha Samudram Trailer Is trending:

<span>Maha Samudram Trailer Is Intense And Intriguing Says Pan India Star Prabhas</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs