Advertisement
Google Ads BL

అక్టోబ‌రు 2న ఇదే మా కథ


ప్రపంచంలోని చాలా మంది వ్యక్తుల‌కు తమ కలల గమ్యస్థానానికి వెళ్లాలనే కోరిక ఉంటుంది. అలా   విభిన్న నేపథ్యం ఉన్న నలుగురు బైక్‌ రైడర్లు తమ గమ్యానికి చేరుకునే మార్గంలో ఒకరికొకరు పరిచయమై  ఒకరి గురించి మరొకరు ఏం తెలుసుకున్నారు? గమ్యానికి ఎలా చేరుకున్నారు? అనే ఆస‌క్తిక‌ర‌ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న చిత్రం ఇదే మా క‌థ‌. ఈ రోడ్ జ‌ర్నీ చిత్రంలో సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో న‌టించారు. గురు పవన్ దర్శకత్వంలో  శ్రీ‌మ‌తి మ‌నోర‌మ స‌మ‌ర్ప‌ణ‌లో గుర‌ప్ప ప‌ర‌మేశ్వ‌ర ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై మహేష్ గొల్లా ఈ చిత్రాన్ని నిర్మించారు.  

Advertisement
CJ Advs

టాలీవుడ్ లోనే మొదటి రోడ్ జర్నీ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కాన్సెప్ట్ టీజ‌ర్‌ను ఇటీవ‌ల విక్ట‌రీ వెంక‌టేష్ రిలీజ్ చేశారు. ఆ టీజ‌ర్‌కి ప్రేక్ష‌కుల నుండి విశేష‌ స్పంద‌న ల‌భిస్తోంది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని గాంధీ జ‌యంతి కానుక‌గా అక్టోబ‌రు 2 న‌గ్రాండ్ రిలీజ్ చేయ‌నున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు మేక‌ర్స్. ఒక ప్రముఖ వ్యాపార దిగ్గజం వ్యక్తి, ఒక మధ్యతరగతి మహిళా తన తండ్రి కన్న కలలు నెరవేర్చాలని ఆరాటం, సమకాలీన ప్రపంచంలో యువత తనలో ఉన్న శక్తులను ఎలా ఒక గమ్యస్థానం వైపు తీసుకువెళ్ళాడు, నేటి కాలంలో ఉన్న మహిళలు తన జీవితంలో నూతన అడ్డంకులను అదే జీవితం కాదు ఇంకా చాలా జీవితం ఉంది అని ఎలా తెలుసుకున్నది అన్నది అక్టోబర్ రిలీజ్ అవుతున్న తెరపై చూడవచ్చు. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్, జునైద్ సిద్దిఖీ ఎడిటర్.

న‌టీన‌టులు: సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్య హోప్, పృధ్వీ రాజ్, శ్రీకాంత్ అయ్యంగార్, సప్తగిరి, జబర్దస్త్ రామ్ ప్రసాద్, త్రివిక్రమ్ సాయి, శ్రీజిత ఘోష్ తదితరులు

Ede maa Katha Released on October 2:

Ede maa Katha Released on October 2
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs