Advertisement
Google Ads BL

రాజీవ్ సాలూర్, కోటి, మణిశర్మ కాంబినేషన్


రెండో షెడ్యూల్ మొదలు పెట్టుకున్న టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్ వారి ప్రొడక్షన్ నెంబర్ 1

Advertisement
CJ Advs

రాజీవ్ సాలూర్, వర్ష విశ్వనాథ్ జంటగా టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్ పతాకాలపై గాజుల వీరేష్ (బళ్లారి) నిర్మాత గా, కిట్టు నల్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం షూటింగ్ సెకండ్ షెడ్యూల్ ఇటీవలే వైజాగ్ లో ప్రారంభం అయ్యింది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఈశ్వర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.  పవన్ కె అచల మాటలందిస్తున్న ఈ సినిమా లో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి సాలూర్ ఓ ముఖ్య పాత్ర లో నటిస్తుండగా సదన్, లావన్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ తదితరులు ఇతర పాత్రలు పోస్తిస్తున్నారు. విష్ణుసూర్య గుంత ఎక్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను వైజాగ్ లో అందమైన లొకేషన్స్ లో చిత్రీకరణ చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత గాజుల వీరేష్ (బళ్లారి) మాట్లాడుతూ.. మా సంస్థ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్ కి మొదలుపెట్టుకుంది. మొదటి షెడ్యూల్ షూటింగ్ అనుకున్న విధంగా బాగా జరిగింది. దర్శకుడు మా అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. హీరో హీరోయిన్స్ రాజీవ్ సాలూర్, వర్ష విశ్వనాథ్ లు మంచి నటనతో అద్భుతమైన కెమిస్ట్రీ ని కూడా పండించారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించిన మణిశర్మ గారు సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కోటి గారు నటించడం విశేషం అన్నారు. 

దర్శకుడు కిట్టు నల్లూరి మాట్లాడుతూ.. ఈ సినిమా ని అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఎంతో ఎంటర్టైనింగ్ గా తెరకెక్కిస్తున్నాం.. ప్రేక్షకులకు నచ్చే ప్రతి అంశం ఈ చిత్రం లో ఉంటుంది. రాజీవ్ సాలూర్, వర్ష విశ్వనాథ్ లు పోటాపోటీగా నటించారు. నన్ను నమ్మి దర్శకుడిగా ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మాత గాజుల వీరేష్ గారికి ధన్యవాదాలు.. తప్పకుండా ఈ సినిమా ఆయనకు మంచి పేరు తెస్తుంది. మణిశర్మ గారి సంగీతం చిత్రానికి హైలైట్ గా నిలుస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం అన్నారు.

నటీనటులు: రాజీవ్ సాలూర్, వర్ష విశ్వనాథ్, కోటి సాలూర్, సదన్, లావన్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ తదితరులు.

సాంకేతిక నిపుణులు: బ్యానర్: టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తికా ఫిలిమ్స్, నిమాటోగ్రఫీ: ఈశ్వర్, ఎడిటర్: రవి మాన్ల, డైలాగ్స్: పవన్ కె అచల, మ్యూజిక్: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విష్ణుసూర్య గుంత, ప్రొడ్యూసర్: గాజుల వీరేష్ (బళ్లారి), స్టోరీ-స్క్రీన్ ప్లే- డైరెక్షన్: కిట్టు నల్లూరి.

Rajiv Salur, Varsha Movie:

Rajiv Salur, Varsha Movie first schedule Complete 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs