Advertisement
Google Ads BL

వరుడు కావలెను నుండి బ్యూటిఫుల్ సాంగ్


ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్  యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక రీతువర్మ జంటగా లక్ష్మీ సౌజన్య ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం  వరుడు కావలెను

Advertisement
CJ Advs

నేడు (22-9-2021) వరుడు కావలెను యూనిట్ చిత్రంలోని ఓ గీతాన్ని విడుదల చేశారు. ఈ వీడియో చిత్రాన్ని వీక్షిస్తే సంగీత, సాహిత్యాల కలబోత అనిపిస్తుంది. వివరాల్లోకి వెళితే….

మనసులోనేనిలిచి పోకె మైమరపుల మధురిమ 

పెదవిదాటి వెలికిరాక బెదురెందుకె హృదయమా

ఎన్నినాళ్ళిలా ఈ దోబూచుల సంశయం

అన్నివైపుల వెనుతరిమే ఈ సంబరం అంటూ సాగే ఈ మధురమైన సాహిత్యం ప్రఖ్యాత గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారింది.

గాయని చిన్మయి వీనుల విందుగా ఆలపించిన ఈ గీతానికి విశాల్ చంద్రశేఖర్ స్వరాలు ప్రాణం పోశాయి. చిత్ర నాయకా నాయికలు మధ్య ప్రేమకు తెర రూపంగా  ఈ గీతం కనిపిస్తుంది. సంగీతం, సాహిత్యం, స్వరం ఈ పాటలో పోటీ పడ్డాయనిపిస్తుంది. వీటికి తోడు నాగశౌర్య, రీతువర్మ లు అభినయం కట్టిపడేస్తుంది. శేఖర్ మాస్టర్ నృత్య రీతులు సమకూర్చారు. నాయిక మనోభావాలకు అద్దంపడుతుందీ గీతం. 

ప్రఖ్యాత రచయత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు సాహిత్యం అందించిన ఈ గీతానికి స్వరాలు సమకూర్చటం గౌరవంగా భావిస్తున్నాను. ఇది నా మనసును ఎంతగానో హత్తుకున్న పాట. చిన్మయి గారు ఆలపించిన ఈ గీతం మీకు కూడా నచ్చుతుంది. ప్రేక్షకులకు,సంగీత ప్రియులకు చాలాకాలంపాటు గుర్తుండిపోయే పాటగా వారి హదయాలలో నిలిచి పోతుందని ఆశిస్తున్నాను అన్నారు చిత్ర సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్. 

ప్రస్తుతం చిత్ర నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. వరుడు కావలెను చిత్ర కథ, కథనం, మాటలు, పాటలు, సన్నివేశాలు, భావోద్వేగాలు,నటీ నటుల అభినయాలు చిత్ర కథా నుగుణంగా సాగి  అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తాయి అన్న నమ్మకాన్ని వ్యక్తం  చేస్తున్నారు చిత్ర దర్శక నిర్మాతలు.

Varudu Kaavalenu: Manasulone Nilichipoke Song Release:

Naga Shaurya Varudu Kaavalenu: Manasulone Nilichipoke Song Release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs