Advertisement
Google Ads BL

హైదరాబాద్ లో మళ్ళీ మొదలు పెట్టిన ఎఫ్ 3 షూట్


అనిల్ రావిపూడి - వెంకీ - వరుణ్ తేజ్ కాంబో లో ఎఫ్ 2 చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్‌గా మూడు రెట్లు ఎక్కువ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో ఎఫ్ 3 సినిమా రాబోతోంది. ఇప్పటికే శర వేగంగా సినిమాను పూర్తి చేసేందుకు చిత్రయూనిట్ ప్రణాళిక వేసింది. ఎంట‌ర్‌టైన్‌మెంట్ చిత్రాలను తెరకెక్కించడంలో అనిల్ రావిపూడి తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. సినిమా సినిమాకి త‌న గ్రాఫ్‌ని పెంచుకుంటూ సూప‌ర్‌స్టార్‌ మ‌హేష్‌బాబు సరిలేరు నీకెవ్వరుతో కలెక్షన్ల వర్షం కురిపించారు అనిల్ రావిపూడి. ఇక ఎఫ్ 2 సినిమాతో నవ్వుల వర్షం కురిపించిన అనిల్ రావిపూడి..ఎఫ్ 3తో మరోసారి నవ్వించేందుకు రాబోతోన్నారు.  

Advertisement
CJ Advs

ఈ చిత్రం మీదున్న అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ఆసాంతం నవ్వుల ఝల్లు కురిపించేలా అనిల్ రావిపూడి స్క్రిప్ట్‌ను రెడీ చేశారు. ఎఫ్ 3 చిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్‌లకు ప్రత్యేకమైన మ్యానరిజంలు, బాడీ లాంగ్వేజ్‌లను క్రియేట్ చేశారు. తమన్నా, మెహ్రీన్‌లు వెంకటేష్, వరుణ్ తేజ్ స‌ర‌స‌న హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోన్నారు.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ హైద్రాబాద్‌లో నేడు (శుక్రవారం) ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో చిత్ర తారాగణం అంతా పాల్గొననున్నారు. మేకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. ఇందులో నటీనటులు, టెక్నీషియన్స్ అందరి మొహాలపై చిరునవ్వుతో  సెట్ అంతా కూడా సందడి వాతావరణం కనిపిస్తోంది.

Venkatesh, Varun Tej F3 Shooting Resumes In Hyderabad:

Victory Venkatesh, Mega Prince Varun Tej, Anil Ravipudi, Sri Venkateswara Creations F3 Shooting Resumes In Hyderabad
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs